తుమ్మి (తుంబి) ఇంగ్లీషుపేరు: తుంబై శాస్త్రీయ నామం: లూకాస్ ఏస్పరా కుటుంబం: లామిఏసియే ఈ మొక్క లు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. …
కాంప్లెక్స్ ఎరువులకు యూరియా ప్రత్యామ్నాయం కాదు రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎరువుల ధరలతో కుదేలవుతున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా ఓ ప్రక్క, యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా అగుపడడం మరో ప్రక్క వెరసి అధిక మోతాదులో యూరియాను వాడుటకు రైతులు మొగ్గు చూపుతున్నారు! ఫలితం… …
పత్తి పంటలో జాగ్రత్తలు: ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత …
(రసంపీల్చే మరియు ఇతర చిన్న చిన్న పురుగుల కొరకు)5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేపపండ్ల పొడిని 100 లీటర్ల నీళ్ళలో వేయండి. అందులో 5 లీటర్ల గోమూత్రం మరియు 1 కిలో ఆవు పేడను కలపండి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా …
1. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇప్పటికీ 60 శాతం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే వుంది. రైతులు, వ్యవసాయకూలీలు, చేతి వృత్తుల కళాకారులు, విభిన్న జీవనోపాధులతో జీవించే శ్రామిక కులాల ప్రజలు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి తక్కువ ఆదాయాలతో జీవిస్తున్నారు. ఆయా సమూహాల సమస్యలు తీవ్రంగా వున్నాయి. 2. రాష్ట్ర స్థాయిలో జీడీపీ నికరంగా …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కేవలం …
నాబార్డ్ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్.ఎ. ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు 25 ఎఫ్.పి.ఓ.ల నుండి సి.ఇ.ఓ.లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలు, ఎఫ్.పి.ఓ.ల నిర్మాణ లక్ష్యాలు, సి.ఇ.ఓ.ల బాధ్యతలు తదితర అంశాలపై …
శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని …
నారుకుళ్ళు తెగులు: నారు మడిలో లేత మొక్కలు గుంపులుగుంపులుగా చనిపోతాయి. నారుకుళ్ళు నివారణ: విత్తనాలను విత్తన శుద్ధి చేసి ఎత్తైన నారుమడులలో నారును పెంచాలి. నారు మొలకెత్తిన తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పిచికారీ చేయాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు కోనఫోరా కొమ్మకుళ్ళు తెగులు : …
పంజాబ్, హర్యానా పంటపొలాల్లో మళ్ళీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ‘నాసా’ శాటిలైట్ చిత్రాలు వీటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. వరి కోతల తర్వాత, సెప్టెంబర్ చివరి వారం నుండీ అక్టోబర్ మధ్య వరకూ పొలాల్లో పంట మిగులు గడ్డిని తగలబెట్టి గోధుమ సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకునే ఈ ప్రక్రియ దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది. …