జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం. నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ …
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనాలను పచ్చళ్ళలో సువాసనకై వాడతాము. ఆకుకూరలలో చాలా పోషక విలువలు ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతికూర మరియు గింజలలో ”ఔషధ గుణాలు” …
సొర, బీర, కాకర, పొట్ల, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ మరియు చిక్కుడు పురుగులు: గుమ్మడి పెంకు పురుగు నివారణ : తల్లి పురుగులు లేత ఆకులను ఆశించి ఎక్కువ నష్టం పంటకు కలిగిస్తాయి. వీటి నివారణకు వేప కషాయం లేదా నీమాస్త్రం రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పండు ఈగ …
వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. రైతులు ప్రతి పంటకాలంలో పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. పురుగుల గురించి, వాటి జీవిత చక్రాల గురించి రైతులకు తెలిసి …
సగటు దిగుబడులు – పంట రుణం – పంటల బీమా – ఆదాయాలు – ఆరోగ్య సమస్యలు (తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఒక ప్రధానమైన పంట) 1. 2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) …
తుమ్మి (తుంబి) ఇంగ్లీషుపేరు: తుంబై శాస్త్రీయ నామం: లూకాస్ ఏస్పరా కుటుంబం: లామిఏసియే ఈ మొక్క లు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. …
కాంప్లెక్స్ ఎరువులకు యూరియా ప్రత్యామ్నాయం కాదు రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎరువుల ధరలతో కుదేలవుతున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా ఓ ప్రక్క, యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా అగుపడడం మరో ప్రక్క వెరసి అధిక మోతాదులో యూరియాను వాడుటకు రైతులు మొగ్గు చూపుతున్నారు! ఫలితం… …
పత్తి పంటలో జాగ్రత్తలు: ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత …
(రసంపీల్చే మరియు ఇతర చిన్న చిన్న పురుగుల కొరకు)5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేపపండ్ల పొడిని 100 లీటర్ల నీళ్ళలో వేయండి. అందులో 5 లీటర్ల గోమూత్రం మరియు 1 కిలో ఆవు పేడను కలపండి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా …