పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్యరక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కషాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్పలితాలు …
ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు, వాగులు, వంకలు, వర్రెలు, బావులు, చెరువులు, నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలిపోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగుతుంటే …
ఏ రకం వరి పంటకైనా విత్తనం పునాది. విత్తనం పండిరచాలి. నూర్పిడి చేయాలి. సరిjైున పద్ధతిలో శ్రేణికరణ (ప్రాసెసింగ్) చేయాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. మంచి నాణ్యమైన విత్తనం విత్తుకుంటే తక్కువ విత్తనం అవసరం అవుతుంది. త్వరగా మొలక వస్తుంది. అంతా ఒకే విధంగా వుంటుంది. తిరిగి నాటు అవసరం తగ్గుతుంది. త్వరగా ఏపుగా …
1. వరి రబీ వరిలో తెగుళ్ళ నివారణ (సమగ్ర సస్యరక్షణ) అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకు ఎండు తెగులు, పొట్టకుళ్ళు తెగులు వీలైనంత వరకు తెగుళ్లను తట్టుకోగ వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. తెగులు సోకని వరి పైరు నుండి విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధిని పాటించాలి. గత పంట అవశేషాలను …
భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి. పంట ఎన్నిక పచ్చిరొట్ట ఎరువులు పచ్చిఆకు ఎరువులు సేంద్రియ ఎరువులు వానపాముల ఎరువు జీవన ఎరువులు మల్చింగ్ పద్ధతి పంటల ఎన్నిక: …
వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ సేపు ఉన్నట్లయితే విపరీతంగా వస్తుంది. మిరపలో వచ్చే ఎండుతెగులు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, భూమిలో తేమవుండి పొలాల్లో మురుగునీరు పారుదల సరిగాలేని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. వరిలో …
ముఖ్యమైన మిరప రకాలు బార్డ్స్ ఐ చిల్లీ (ధని) ఇది ముఖ్యంగా మిజోరాం, మణిపూర్ ప్రాంతాల్లో పండిస్తారు. మిరప రకల్తవర్ణంలో ఉండి ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో కోతకు వస్తుంది. కలకత్తా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఇందులో క్యాప్సిసిన్ శాతం 0.58 2.బ్యాడగి ఇది ముఖ్యంగా కర్ణాటకలోని …
విత్తనశుద్ధి ఎంపిక చేసిన విత్తనాలను విత్తేందుకు ముందు రకరకాల పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసినచో పంటకాలంలో ఆశించే చీడపీడలను చాలావరకూ నివారించవచ్చు. ఆవు మూత్రంతో విత్తనశుద్ధి: విత్తనాల్ని ఆవు మూత్రంతో శుద్ధి చేయడం వల్ల మొక్కలలో రోగాలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. మొదట 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచాలి. అందులో …
ప్రధానం పొలం తయారీ విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును చేయడమే గాక, నేలను సారవంతం చేసే పనులు కూడా చేపట్టాలి. సేంద్రియ సేద్యం విధానంలో సులభంగా దొరికే దిబ్బ ఎరువు, వేపచెక్క వంటివి వేయాలి. వీటితో పాటు, …
నారుమడి తయారీ వరి విత్తడానికి ముందు నారుమడి స్థలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధంగా నారుమడి నేలను సారవంతం చేయాలి. ఈ నేలలో పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నాలి. చేదు గుణాలున్న వేప తదితర ఆకులు పచ్చిరొట్టకు బాగా ఉపయోగ పడతాయి. వేప ఆకు నేలను సారవంతం చేయడమే గాక …