2020-21 బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రధాన్యత ఇవ్వాలి – అఖిల భారత రైతు సంఘాల పోరాటాల సమన్వయ సమితి – ఎ.ఐ.కె.ఎస్.సి.సి.
2020-21 బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రధాన్యత ఇవ్వాలి
అఖిల భారత రైతు సంఘాల పోరాటాల సమన్వయ సమితి – ఎ.ఐ.కె.ఎస్.సి.సి.
2020-21 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి చర్చించి మీ ముందు నిర్ధిష్టమైన ప్రతిపాదలను వుంచాలని భావించింది. మీరు పరిశీలించి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తగిన ప్రధాన్యత వుండే విధంగా చర్యలు తీసుకోవాని కోరుతున్నాం.
2020-21 వ్యవసాయ బడ్జెట్లో ఈ దిగువ అంశాలు, వాటికి కావాల్సిన బడ్జెట్ను కేటాయించాలి.
1. గతంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. వచ్చే బడ్జెట్లో కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి.
2. రైతుబంధు పథకం వాస్తవ సాగుదారులందరికీ అమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
3. రైతుబీమా: రైతు బీమా పథకాన్ని వ్యవసాయం చేస్తున్న రైతుందరికీ వర్తింపజేయాలి. వ్యవసాయ కార్మికుకు, కౌలుదారుకు కూడా బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి.
4. రుణమాఫీ: రైతుకు లక్షలోపు (రూ. 24,000 కోట్లు) ఒకే సారి చెల్లించే విధంగా మొత్తం రుణాన్ని ప్రభుత్వం తన ఖాతాకు జమ చేసుకొని విడత వారీగా బ్యాంకుకు చెల్లించాలి.
5. రుణాలపై వడ్డీ: కేంద్రం ఇస్తున్న వడ్డీమాఫీ కాకుండా రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ కార్మికుల రుణాలకు వడ్డీ మాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు చెల్లించాలి.
6. ప్రకృతి వైపరీత్యాల పరిహారం: ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద 15వ ఫైనాన్స్ కమీషన్ కేటాయింపులతో పాటు రాష్ట్ర బడ్జెట్లో రూ. 3,500 కోట్లు (కేంద్రం, రాష్ట్ర 75:25 శాతం) కోట్లు కేటాయించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 పరిహారంగా చెల్లించాలి.
7. పంట బీమా: పంట బీమా ప్రీమియం పూర్తిగా (రూ. 1,000 కోట్లు) ప్రభుత్వమే రైతులందరికీ చెల్లించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీమా పథకంలో చేరడాన్ని రైతు స్వేచ్ఛకు వదిలి వేసింది. ఈ పథకం వల్ల రైతు అనాసక్తి చూపుతారు. విధిగా రైతులందరికి పంట బీమా పథకంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి.
8. మార్కెట్ జోక్యం కేటాయింపు: ప్రభుత్వ నిర్ణయించిన ధరలు మార్కెట్లో అమలు జరిపించటానికి రూ. 4,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. ఈ నిధులతో మార్కెట్లో ప్రభుత్వం కనీస మద్ధతు ధర కొనుగోళ్ళు చేపట్టాలి. లేదా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మినచో మద్ధతు ధరలకు తక్కువ వచ్చిన లోటును ఈ నిధుల ద్వారా రైతులకు పూడ్చాలి. మార్కెట్లో ‘వే బ్రిడ్జి’ు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వే బ్రిడ్జిలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి.
9. హార్టిక్చర్ : రుణాల మాఫీకి మరియు హార్టిక్చర్ యూనివర్సిటీ, హార్టిక్చర్ సబ్సిడీ (మొక్క సబ్సిడీ, పామాయిల్ సబ్సిడీ), తదితర పద్దులకు రూ. 1,500 కోట్లు కేటాయించాలి.
10.సెరీకల్చెర్ : సెరీకల్చెర్ అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయింపు చేయాలి.
11. పశు పోషణ, డెయిరీ అభివృద్ధి: పశు పోషణ, డెయిరీ అభివృద్ధి నిర్వహణకు కేంద్రం నుండి వచ్చేల నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించాలి. పెరుగుతున్న ధరకనుగుణంగా రైతుకు పాల సేకరణ సబ్సిడీకి లీటరుకు రూ. 10 అదనంగా సబ్సిడీ ఇవ్వాలి. అందుకు కావాల్సిన నిధులు కేటాయించాలి.
12. వ్యవసాయ పరిశోధనలు: పంట పరిశోధనలకు జయ శంకర్ విశ్వవిద్యాలయానికి, హార్టిక్చర్, పశు పోషణ యూనివర్సిటీలకు రూ. 500 కోట్లు కేటాయించాలి. వాతావరణ పరిస్థితులకనుగుణంగా విత్తన తయారీకి ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. రాష్ట్రంలో 27 పరిశోధన కేంద్ర మరియు వాటికి తగిన భూమి కూడా వుంది.
13. చవిటి నేలలు బాగుచేయుటకు: (జిప్సం, జింక్) సరఫరాలతో పాటు ఇతర పథకాలను అమలు చేయుటకు రూ. 600 కోట్లు కేటాయించాలి.
14. ఇందిర ప్రభ, ఇందిర జల ప్రభ: పథకాల ద్వారా (దళిత, గిరిజనులకు) భూమిని చదును చేయుటకు బోర్లు వేయుటకు రూ. 1,000 కోట్లు కేటాయించాలి.
ప్రభుత్వం నిర్వహించాల్సిన చర్యలు:
15. సహకార వ్యవస్థ అభివృద్ధి: గ్రామ, జిల్లా సహకార సంఘాల ఆర్థిక లోటులో కొనసాగుతున్నాయి. కేరళ తరహా ప్రభుత్వ బడ్జెట్ డిపాజిట్లు సహకార సంఘాలలో పెట్టాలి. ఆ విధంగా బ్యాంకులకన్న ఎక్కువ రైతుకు సేవ చేసే వివిధ సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి.
16. రైతు కుటుంబాలకు : విద్య, వైద్య సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం పూర్తి రాయితీ ఇవ్వాలి. ఢిల్లీ రాష్ట్రం మాదిరిగా విద్య, వైద్య సౌకర్యము కల్పించాలి.
17. వ్యవసాయ విస్తరణ: ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయరంగంలో 7,296 పోస్టు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు ప్రతి 2,500 ఎకరాకు ఒక ఎ.ఇ.ఓ.ను నియమించాలి.
18. విత్తన సబ్సిడీ: హైబ్రిడ్ వెరైటీలు వేసే వారికి పూర్తి విత్తన సబ్సిడీ ఇవ్వాలి. విత్తనాలు, మార్కెట్ కమిటీల ద్వారా మాత్రమే అందించాలి. విత్తన కల్తీ నిరోధక చట్టం తేవాలి. ప్రస్తుత శాసనసభ సమావేశాలో రాష్ట్ర విత్తన చట్టం రూపొందించి ఆమోదింపచేయాలి. కేంద్ర చట్టం తెచ్చినప్పుడు రాష్ట్ర చట్టం దానికి లోబడి వుంటుంది.
19. కౌలుదారులు: కౌలుదారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తూ సహకార సంఘాల ద్వారా వారీ ఆదాయాన్ని అభివృద్ధి పరచాలి.
20. పంట రుణాలు: పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులందరికీ మొత్తం సాగు భూమికి తగిననన్ని రుణాలు ఇవ్వాలి. ఇంత వరకూ రాష్ట్రంలో 59 లక్ష మంది రైతు వుండగా 29 లక్ష మంది రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. దాదాపు సగం మంది రైతులు ఇంత వరకు బ్యాంకు గడప తొక్కలేదు. రైతులందరికీ పంట రుణాలు ఇవ్వడం వన ప్రైవేట్ రుణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
21. ధర నిర్ణయాక సంఘం ఏర్పాటు: రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులకు ధరలు నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయాక సంఘాన్ని (కర్నాటకలో లాగా) ఏర్పాటు చేయాలి.
22. నిల్వ గోదాముల ఏర్పాటు: తగినన్ని గోదాములు ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అన్ని మార్కెట్ యార్డులలో కోల్డ్ స్టోరేజ్, కామన్ గోదాములు ఉండాలి. ఇవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా రైతులకు అందుబాటులో వుంచాలి.
23.పోడు భూముల సమస్యలు: ఏజెన్సీలో వాస్తవ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి. వారికి రుణ సౌకర్యంతో పాటు ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలి.
24. పంటలకు బోర్డును: పంటలకు బోర్డును ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిశోధన, విస్తరణ, ఉత్పాదకత పెంపు, భూసార పరీక్షలు, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా అన్ని పంటలకు రక్షణ కల్పించాలి.
25. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సౌకర్యం: ఐ.డి.సి. ద్వారా దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారికి బోర్లు వేయుట, నిర్వహణ చేయుటకు ఐ.డి.సి.ని వినియోగించాలి. లిఫ్ట్ పథకాలు వారి ద్వారానే నిర్మానం చేయించాలి. గతంలో ఈ డిపార్ట్మెంట్కు కేటాయించిన నిధులకు అదనంగా భూమి పన్నుల ద్వారా తమ వేతనాలు పోగా నిల్వ సంపాదించారు.
26. అడవి జంతువుల నివారణ: అడవి జంతువు వన పంట నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పంట నష్టం జరిగినచో ప్రభుత్వం ముందు రైతులకు చెల్లించి ఆ తరువాత అటవీ శాఖ నుండి రికవరి చేసుకోవాలి.
27. కోళ్ళు, చేపలు, చిన్న పశువులు: (గొర్రొలు, మేకలు, పందులు) పెంపకానికి బ్యాంకు ద్వారా రూ. 3 లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇప్పించాలి.
28. రైతులకు పెన్షన్: అరవై ఏళ్ళు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ. 10000 పెన్షన్ ఇవ్వాలి.
29. వాతావరణ పరిశోధన: వాతావరణంలో వస్తున్న మార్పు పై అధ్యయనం చేసి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
30. ప్రాజెక్టులు: ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
బడ్జెట్ కేటాయింపులు
1 | రైతు బంధు | రూ. 14,000 కోట్లు |
2 | పంట బీమా ప్రీమియం | రూ. 1,000 కోట్లు |
3 | రైతు బీమా ప్రీమియం | రూ. 3,200 కోట్లు |
4 | రైతులకు లక్ష లోపు రుణమాఫీ (రూ. 24000 కోట్లు) | రూ. 6,000 కోట్లు |
5 | రుణాలపై వడ్డీ మాఫీ | రూ. 1,000 కోట్లు |
6 | ప్రకృతి వైపరిత్యాల పరిహారం | రూ. 3,500 కోట్లు |
7 | మార్కెట్ జోక్యం కేటాయింపులు | రూ. 4,000 కొట్లు |
8. | హర్టీకల్చర్ సబ్సిడీ రుణాల రద్దు | రూ. 1,500 కొట్లు |
9. | సెరీ కల్చర్ | రూ. 400 కోట్లు |
10. | డెయిరీ అభివృద్ధి, సబ్సిడీ | రూ. 500 కోట్లు |
11. | వ్యవసాయ పరిశోధలను, యూనివర్సిటీలు | రూ. 500 కోట్లు |
12. | చవిటి నేలలు బాగుచేయుటకు | రూ. 600 కోట్లు |
13. | ఇందిరా ప్రభ, ఇందిరా జల ప్రభ పథకాలు | రూ. 1,000 కోట్లు |
మొత్తం | రూ. 37,200 కోట్లు |
పై చర్య కొంత మేరకు వ్యవసాయ వుత్పత్తి, ఉత్పాదకాలతో పాటు ఆత్మహత్య నివారణకు అవకాశం వుంటుంది. పై సూచనను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం.