వివిధ పంటల సస్యరక్షణలో ఉపయోగపడే కషాయాలు – నీమాస్త్రం
(రసంపీల్చే మరియు ఇతర చిన్న చిన్న పురుగుల కొరకు)
5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేపపండ్ల పొడిని 100 లీటర్ల నీళ్ళలో వేయండి. అందులో 5 లీటర్ల గోమూత్రం మరియు 1 కిలో ఆవు పేడను కలపండి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా కలపండి. 24 గంటల వరకూ మూసి ఉంచండి. ఆ తర్వాత గుడ్డతో వడకట్టి పంటలకు పిచికారీ చేయండి.
ఉపయోగాలు:
– నీమాస్త్రాన్ని అన్ని పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులు, చిన్న లార్వాల నియంత్రణలో ఉపయోగించవచ్చు.
– పంటలలో వచ్చే పురుగుల నియంత్రణకు 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
– నీమాస్త్రాన్ని అన్ని పంటలలో 2-3 సార్ల వరకు పిచికారీ చేసుకోవచ్చు.
Tag:నీమాస్త్రం