కేంద్ర విత్తన చట్టం – 2019 ముసాయిదా
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2004కు 2010లో సవరణ తెచ్చింది. ఈ చట్టాలు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టలేదు.
ప్రస్థుతం కేంద్ర 2014 చట్టానికి సవరణలు తేస్తూ ”విత్తన చట్టం -2019 ముసాయిదాను” చర్చకు విడుదల చేసింది. 2014లోని చట్టాలు, 2019 సవరణలు ఈ దిగువ చర్చించబడినాయి.
అధ్యాయం -1
ప్రాధమికమైనవి
సెక్షన్ -1, చట్టం టైటిల్
2004 2019
55వ సంవత్సరం 70వ సంవత్సరం
చట్టం 2004 చట్టం 2019
సెక్షన్ -2, పదాల వివరణ
- ”వ్యవసాయం” – అనగా హార్టికల్చర్ అడవులు, మొక్కల సాగు పంటలు, ఔషధ, సుగంధపరమైన మొక్కలు
- ”రైతు” – అనగా స్వంత భూమి సాగు లేదా ఇతర విధాలుగా సాగు లేదా వ్యవసాయ పనుల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన పనులు చేయువారు.
- ”నేషనల్ సీడ్ వెరైటీస్” – ఒకటికి మించిన రాష్ట్రాలలో సాగుచేస్తున్న విత్తన రకాలు
- ”నోటిఫికేషన్” – అధికార గెజిట్‌లో ప్రకటించడం.
అధ్యాయం-2
కేంద్ర విత్తన కమిటీ మరియు సబ్ కమిటీల రిజిస్ట్రేషన్
3. కేంద్ర విత్తన కమిటీ రిజిస్ట్రేషన్ – సబ్ కమిటీల నియామకం
4. విత్తన కేంద్ర కమిటీ కూర్పు
- ఛైర్పర్సన్-సభ్యులు-ఎక్స్ అఫిషియో- ఇతర సభ్యులు – కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు.
- కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి – వ్యవసాయ – సహకార – రైతు సంక్షేమ శాఖ-వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన వారు ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. (ఎక్స్ అఫిషియో)
ఎక్స్ అఫిషియో సభ్యులు
1. భారత వ్యవసాయ కమీషనర్
2. డిప్యూటి డైరెక్టర్ జనరల్ (క్రాఫ్ సైన్స్) ఐసిఎఆర్
3. డిప్యూటి డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్ సైన్స్), ఐసిఎఆర్
4. భారత విత్తన ఇంచార్జ్ జాయింట్ సెక్రటరీ
5. భారత హార్టికల్చర్ కమీషనర్
6. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్
7. భారత పర్యావరణ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ ¬దా కలిగిన వారు
8. జాతీయ ఔషధ మరియు సుగంధపరమైన మొక్కల పెంపకపు డైరెక్టర్
9. మొక్కల పరిరక్షణ రైతుల హక్కుల అథారిటీ ఛైౖర్మెన్
10. జాతీయు బయోడైవర్శిటీ అథారిటీ ఛైౖర్మెన్
వీరు కాక 8 మంది సభ్యులుంటారు.
5. కమిటీ విధులు
6. విత్తన నాణ్యత
విత్తన నాణ్యతకు గతంలో కమిటీ నోటిపై చేయాల్సి ఉండగా దానిని-2019లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని మార్చబడింది.
రైతు సంఘాల సూచన :
సెక్షన్ 6లో విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100శాతం ఉండాలి.
7. సబ్ కమిటీ – ఇతర కమిటీల రిజిస్ట్రేషన్ మరియు వాటి బాధ్యతలు
8. కమిటీ-సబ్ కమిటీల బాధ్యత
9. కార్యదర్శి మరియు ఇతర అఫీస్ బేరర్లు కమిటీ
10. కమిటీ సమావేశాలు
11. రాష్ట్ర విత్తన కమిటీలు
– రాష్ట్ర విత్తన రకాలను 2019 ప్రకారం రిజిస్ట్రి చేయాలి. హార్టికల్చర్‌కు బదులు పండ్ల తోటల నర్సరీలుగా మార్పు చేశారు.
మన సూచన :
సెక్షన్ 11లో రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు మహిళ) నియమించాలి.
అధ్యాయం – 3
విత్తన రకాలు, వెరైటీల రిజిస్ట్రేషన్
12. జాతీయ విత్తనాల రిజిస్ట్రేషన్ – విత్తన రకాలు మరియు ప్రత్యేకతలు
13. జాతీయ విత్తన రకాలు మరియు రాష్ట్రాల విత్తన రకాలు – రిజిస్ట్రేషన్
14. ఇతర ప్రత్యేక విత్తనాల రిజిస్ట్రేషన్
15. రిజిస్ట్రేషన్ విధానం
16. జన్యుమార్పిడి రకాల ప్రత్యేక ప్రోవిజన్ కొరకు రిజిస్ట్రేషన్
17. విత్తన రకాలు మరియు వెరైటీల రిజిస్ట్రేషన్ రద్దు పరుచుట
18. రిజిస్ట్రేషన్ రద్దు పరుచుటానికి నోటిపికేషన్ విడుదల చేయుట
19. విత్తన రిజిస్ట్రేషన్ నుండి కొన్ని రకాలను మినహాయించుట (పర్యావరణానికి నష్టం, వాణిజ్య దోపిడి రకాలను)
20. విత్తన ట్రయల్స్‌ను సమీక్షించడం
21. రైతుకు నష్టపరిహారం
– రైతు సంపెనీ నుండి కొనుగోలు చేసిన విత్తనం నాశిరకం అయి రైతు నష్టపోయినచో వినియోగదారుల చట్టం 1986 ప్రకారం (68/1986) పరిహారం చెల్లించాలి.
మన సూచన :
సెక్షన్ 21లో రైతు నాశిరకం విత్తనం వలన నష్టపోయినచో కంపెనీ లేదా దుకాణదారుడు రైతుకు మొత్తం పంట నష్టం చెల్లించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత కంపెనీ నుండి రియంబర్స్ చేసుకోవాలి. పంట నష్టం అనగా మొత్తం పంట దిగుబడి నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కంపెనీ లైసన్స్ రద్దు చేయాలి. లైసన్స్‌ను అతని కుటుంబ సభ్యులకుగాని, బందువులకుగాని ఇవ్వారాదు. పి.డి చట్టాన్ని అమలు చేయాలి. కంపెనీ లైసన్స్ హోల్డర్‌కు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమాన విధించాలి.
22. విత్తన ఉత్పత్తిదారులు, ప్రొసెసింగ్ యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేయుటు
23. విత్తన అమ్మకం డీలర్లు రిజిస్ట్రేషన్ చేయుట
మన సూచన :
సెక్షన్ 23లో మైనర్లను డీలర్లుగా నియమించరాదు. వ్యవసాయ శాఖ ప్రాధమిక డిగ్రీ ఉన్నవారికే డీలర్ లైసన్స్ ఇవ్వాలి. (ఉదా. మెడికల్ షాప్‌లకు బి పార్మసీ సర్టిపికేట్ ఉండాలి.) కాలం గతించిన (ఆవుట్ డెటేడ్) విత్తనాలు అమ్మినచో ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5లక్షలు జరిమాన విధించాలి. డీలర్లు కంపెనీపై భాద్యత నెట్టరాదు. స్వచ్చత గల విత్తనాలనే అమ్మాలి. కంపెనీతోపాటు డీలర్‌కూడా రైతుకు భాద్యత వహించాలి.
24. పండ్ల మొక్కల నర్సరి రిజిస్ట్రేషన్ చేయుట
మన సూచన :
సెక్షన్ 24లో ప్రతి పండ్ల మొక్కల నర్సరి హెక్టార్‌కు లోపు ఉన్నప్పటికీ లైసన్స్ పోందాలి. నాణ్యతలేని మొక్కలు ఉత్పత్తి చేసినచో రెండు సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5 లక్షలు జరిమాన విధించాలి. రైతుకు ఎకరాకు లక్ష రూపాయాలు పరిహారం నర్సరి లైసన్స్దారుడు చెల్లించాలి.
25. పండ్ల నర్సరి రిజిస్ట్రేన్దారుల భాద్యతలు
అధ్యాయం-4
విత్తన దృవీకరణ సంస్థలు మరియు విత్తన అమ్మకాల క్రమబద్దికరణ
26. రిజిస్ట్రీ అయిన విత్తన అమ్మాకాలను, రకాలను క్రమబద్దికరించుట
27. అత్యవసర పరిస్థితిలో అమ్మకం ధర క్రమబద్దికరించుట
28. రాష్ట్ర విత్తన దృవికరణ ఎజెన్సీ
29. విత్తన దృవీకరణ ఎజెన్సీ అక్రీడెషన్
30. రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ ద్వారా సర్టిపికేట్ ఆమోదించుట
31. సర్టిపికేట్ రద్దు పరుచుట
32. భారతదేశానికి బయట విత్తన దృవీకరణ సంస్థ ఆమోదం.
అధ్యాయం -5
అప్సీల్స్
33. అప్పీల్స్
అధ్యాయం-6
విత్తన విశ్లేషణ మరియు పరీక్షలు
34. కేంద్ర, రాష్ట్రాల విత్తన పరిశీలన లెబోరెటరీలు
35. విత్తన విశ్లేషకులు
36. విత్తన విశ్లేషకుల రిపోర్టు
37. కోర్టుకు విత్తన విశేషణలు ఇచ్చుట
38. విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్లు
39. విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్ల అధికారాలు
అధ్యాయం-7
విత్తనాలు దిగుమతులు మరియు ఎగుమతులు
40. దిగుమతి విత్తనాలు
– 1986 చట్టం ప్రకారం నష్టం రాని విధంగా దిగుమతి చేసుకోవాలి.
మన సూచన :
సెక్షన్ 40లో దిగుమతి విత్తనాలను 21 రోజులు క్వారం టైన్ పెట్టి, పరిశోధనలు చేసి మన వాతావరణానికి తగినవని దృవీకరించబడిన తరువాతనే దిగమతులను మార్కెట్‌కు విడుదల చేయాలి. ఒక వాతావరణంలోని విత్తనాలు మరో వాతవరణంలో మొలకేత్తవు. (ఉదా. గతంలో దున్నలను దిగుమతి చేసుకోని బోన్ క్యాన్సర్ ఉండడం వల్ల డబ్బులు చేల్లించి చంపెశాం)
41. ఎగుమతి విత్తనాలు
అధ్యాయం-8
నేరాలు మరియు శిక్షలు
42. నేరాలు మరియు శిక్షలు (నాణ్యత సర్టిపై చేసే అధికారికి 2019 చట్టంలో)
1) రాష్ట్ర విత్తన కమిటీ, సబ్ కమిటీల ద్వారా విత్తన నాణ్యతను పరిరక్షించే అధికారిని నియమించాలి. ఆ అధికారి చట్ట ప్రకారం విధులు నిర్వహించనిచో రూ.25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పరిహరంతో శిక్షించాలి.
2) జీవవైవిద్య విత్తన రకాల విషయంలో ఈ శిక్షను రూ.25 వేల నుండి లక్ష రూపాయల వరకు విదించవచ్చు.
3) తప్పుడు సమాచారం జనటిక్ ప్య్రూరిటి, తప్పడు బ్రాండ్ మరియు నాణ్యత లేని జీవవైవిద్య విత్తనాలను, రిజిస్ట్రర్ కాని విత్తనాలను దృవీకరించినచో ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమాన లేదా రెండిటిని విదించవచ్చు.
మన సూచన :
సెక్షన్ 42లో విశ్లేషణ అధికారి లేదా నాణ్యత పరిరక్షించే అధికారిని నియమించిన పై అధికారికి ఏడాది జైలు శిక్ష, రూ.5లక్షల జరిమాన విధించాలి.
43. అస్తుల జప్తులు
44. విత్తన కంపెనీల నేరాలు
మన సూచన : సెక్షన్ 44లో నేరాలకు పాల్పడిన కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థల లైసన్స్‌లను రద్దుచేయాలి. కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల తీర్పులే అంతిమ నిర్ణయంగా ఉండాలి. వీటిపై ఏలాంటి అప్పీల్లు ఉండరాదు. కమిటీ నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సెక్షన్ 21లో చూపిన శిక్షను కంపినీలపై అమలు జరపాలి.
అధ్యాయం-9
కేంద్ర ప్రభుత్వ అధికారాలు
45. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం
46. కమిటీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం
అధ్యాయం-10
ఇతరములు
47. చట్టంలోని అంశాల మినహాయింపులు
48. మంచి ఉద్దేశంతో తక్షణ చర్యలు చేపట్టుట
49. అటంకాల తొలగింపుకు అధికారాలు
50. కేంద్ర ప్రభుత్వం రూల్స్ రూపొందించే ఆధికారం
51. కమిటీలు క్రమబద్దికరించే హక్కులు
52. పార్లమెంట్ ముందు రూల్ నోటిపికేషన్ పెట్టుట
53. కొట్టివేయడము మరియు కాపాడటం
Tag:విత్తన విశ్లేషణ