కేంద్ర విత్తన చట్టం ముసాయిదా తెలంగాణ రైతు సంఘం సవరణలు
1 సెక్షన్ 6: విత్తన నాణ్యతలో… విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80 శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100 శాతం ఉండాలి.
2. సెక్షన్ 11: రాష్ట్ర విత్తన కమిటీలలో… రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు మహిళ) నియమించాలి.
3. సెక్షన్ 21: రైతుకు నష్టపరిహారంలో… రైతు నాసిరకం విత్తనం వలన నష్టపోయినచో కంపెనీ లేదా దుకాణదారుడు రైతుకు మొత్తం పంట నష్టం చెల్లించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత కంపెనీ నుండి రియంబర్స్ చేసుకోవాలి. పంట నష్టం అనగా మొత్తం పంట దిగుబడి నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కంపెనీ లైసన్స్ రద్దు చేయాలి. లైసన్స్‌ను అతని కుటుంబ సభ్యులకుగానీ, బంధువులకుగానీ ఇవ్వరాదు. పి.డి చట్టాన్ని అమలు చేయాలి. కంపెనీ లైసన్స్ హోల్డర్‌కు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించాలి.
4.సెక్షన్ 23: విత్తన అమ్మకం డీలర్లు రిజిస్ట్రేషన్ చేయుటలో… మైనర్లను డీలర్లుగా నియమించ రాదు. వ్యవసాయ శాఖ ప్రాధమిక డిగ్రీ ఉన్నవారికే డీలర్ లైసన్స్ ఇవ్వాలి. (ఉదా. మెడికల్ షాప్‌లకు బి ఫార్మసీ సర్టిఫికేట్ ఉండాలి.) కాలం గతించిన (ఆవుట్ డెటేడ్) విత్తనాలు అమ్మినచో ఒక సంవత్సరం జైలు శిక్ష, మరియు రూ.5 లక్షలు జరిమానా విధించాలి. డీలర్లు కంపెనీపై బాధ్యత నెట్టరాదు. స్వచ్ఛత గల విత్తనాలనే అమ్మాలి. కంపెనీతోపాటు డీలర్ కూడా రైతుకు బాధ్యత వహించాలి.
5. సెక్షన్ 24: పండ్ల మొక్కల నర్సరీ రిజిస్ట్రేషన్ చేయుటలో… ప్రతి పండ్ల మొక్కల నర్సరీ హెక్టార్‌కు లోపు ఉన్నప్పటికీ లైసన్స్ పొందాలి. నాణ్యతలేని మొక్కలు ఉత్పత్తి చేసినచో రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5 లక్షలు జరిమానా విధించాలి. రైతుకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం నర్సరీ లైసన్స్దారుడు చెల్లించాలి.
6. సెక్షన్ 40: దిగుమతి విత్తనాలలో… దిగుమతి విత్తనాలను 21 రోజులు క్వారంటైన్ పెట్టి, పరిశోధనలు చేసి మన వాతావరణానికి తగినవని ధృవీకరించబడిన తరువాతనే దిగుమతులను మార్కెట్‌కు విడుదల చేయాలి. ఒక వాతావరణం లోని విత్తనాలు మరో వాతావరణంలో మొలకెత్తవు.
7.సెక్షన్ 42: నేరాలు మరియు శిక్షలలో… విశ్లేషణ అధికారి లేదా నాణ్యత పరిరక్షించే అధికారిని నియమించిన పై అధికారికి ఏడాది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించాలి.
8. సెక్షన్ 44: విత్తన కంపెనీల నేరాలలో… నేరాలకు పాల్పడిన కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థల లైసన్స్‌లను రద్దుచేయాలి. కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల తీర్పులే అంతిమ నిర్ణయంగా ఉండాలి. వీటిపై ఎలాంటి అప్పీల్లు ఉండరాదు. కమిటీ నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సెక్షన్ 21లో చూపిన శిక్షను కంపెనీలపై అమలు జరపాలి.
– సారంపల్లి మల్లారెడ్డి
Tag:విత్తన చట్టం, సవరణలు