వెంపలి
వెంపలి
ఈ మొక్కలో టెఫ్రోసిన్, ఫ్లావనాయిడ్స్, టెర్పిన్స్ వంటి అనేక రసాయనాలు ఉంటాయి.
వెంపలి మొక్కను ”పచ్చిరొట్ట” ఎరువుగా అనాదికాలం నుండి వినియోగిస్తున్న విషయం రైతులందరికి తెలిసిందే. వెంపలి మొక్కలో నత్రజని (3.4 శాతం), భాస్వరం (0.3 శాతం), పొటాష్ (2.4 శాతం) మరియు సూక్ష్మ పోషకాలు చాలా వున్నాయి. అందువలన ఈ మొక్కను వరి పండించే రైతులు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు. ”పచ్చిరొట్ట” ఎరువుగా వీలుకాని పరిస్థితులలో ”పచ్చిఆకు ఎరువుగా” కూడా వుపయోగించు కోవచ్చు. వెంపలి మొక్కలో వున్న ”టెఫ్రోసిన్” అనే రసాయనం చాలా శక్తివంతమైనది. ఈ రసాయనానికి పురుగులను వికర్షించే గుణం మరియు కీటక నాశని లక్షణాలు కలిగి వున్నాయని డా|| భాగ్య (2009) మరియు డా|| వేండన్ (2012) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అందువలన ఈ మొక్కను వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు రైతులు వినియోగించుకోవచ్చు.
వెంపలి మొక్క ఆకుల కషాయానికి ”కాలిఫ్లవర్”, ”క్యాభేజీ” పంటలనాశించే ”డైమండ్ బ్యాక్ మాత్” (డైమండ్ మచ్చల పురుగు) పురుగును నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| జాస్మిన్ మరియు డా|| సుందరి (2012) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వెంపలి మొక్కలు ఎక్కువగా వున్న పొలాలల్లో నులి పురుగుల (నెమటోడ్స్) బెడద తక్కువగా వుంటుంది.
Tag:వెంపలి