వాకుడు (నేల ములక)
వాకుడు (నేల ములక)
వాకుడు ఇసుక నేలలలోనూ, బీడు భూములలోనూ, గ్రామాలలో కంచెల వెంబడీ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క అన్ని భాగాలనూ ఆయుర్వేద వైద్యంలో, మందుల తయారీలో వుపయోగిస్తారు.
వాకుడు మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువలన ఈ మొక్కను వ్యవసాయంలో, సస్యరక్షణలో, పురుగుల నియంత్రణ కోసం రైతులు వుపయోగించుకోవచ్చు.
వాకుడు కషాయానికి దోమల లార్వాలను నిర్మూలించే గుణం వుందని డా|| లలిత్ 2007 (ఉత్తర ప్రదేశ్) పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని చాలా మంది శాస్త్రజ్ఞులు నిర్ధారణ చేయడం జరిగింది.
వాకుడు మొక్క కషాయానికి ఆవాల పంటలో వచ్చే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| గులేరియా (2008) పరిశోధనలో నిరూపితమైనది. ఈ ఆకు మచ్చ తెగులు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి పంటలను కూడా ఆశిస్తుంది.
ఈ మొక్క అంతటా ముండ్లు వుండుట వలన, వుపయోగించడంలో రైతులకు మెళకువ అవసరం. మొక్కను వివిధ ఆకుల ద్రావణంలో వుపయోగించి పంటలపై వచ్చే రసం పీల్చే పురుగుల నివారణలో వుపయోగించవచ్చు.
Tag:వాకుడు