నాలుగు నెలల కంటే తక్కువ వయసుగల మేక, గొర్రె పిల్లలలో పారుడు / పుర్రులో రకాలు
శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం
పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని ద్రావకాలను క్రింద ఇస్తున్నాము. వాటిలో దేనినైనా చేసి చూడండి.
జబ్బుపేరు – కారణం | నివారణ |
కాక్సీడియాసిస్ | పరిశుభ్రత పాటించాలి. పిల్లలను మేత తొట్టెల బయట వుంచాలి. వాటి పేడ నీటి తొట్టెలలో పడకుండా ఏర్పాటు చేయాలి, ఏ విధమైన ఒత్తిడి కలగకుండా చూడాలి. |
ముర్రుపాల లోపం | పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలను పొడిగా వుండే, పరిశుభ్రమైన వెచ్చటి సురక్షితమై చోట వుంచాలి. |
కోలై బాసిల్లాసిస్ | పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలను పొడిగా వుండే, పరిశుభ్రమైన వెచ్చటి సురక్షితమైన చోట వుంచాలి. |
చిటుకు రోగం – ఇ.టి. | టీకా ఇప్పించాలి |
పట్టలు, బొల్లలు, జెనిగలు | నట్టల మందు ఇవ్వాలి, మంచి పోషక పదార్థాలు గల మేత పెట్టాలి, పరిసరాలు పరిశుభ్రంగా వుంచాలి. మూడు నెలల వరకు బయట మేపటానికి తీసుకెళ్ళకూడదు. |
- బకెట్ నీళ్లలో 50 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల బెల్లం (లేదా పంచదార) కలపండి. తనంతట తాను తాగకపోతే ఈ ద్రావకాన్ని జీవాలకు బలవంతంగా తాగించండి.
- కొబ్బరి బోండాం నీటిని పారుడు లేదా పుర్రు తగ్గేదాకా రోజుకు రెండు మూడు సార్లు ఇవ్వండి.
- గంజి లేదా రాగి అంబలికి ఉప్పు కలిపి రోజుకు రెండు సార్లు తాగించండి. ఆ గంజికి ఒక గ్రాము సొంఠి కూడా కలపవచ్చు.
- సాధారణంగా మేత లోపం వల్ల వచ్చే పారుడుకు వైద్యాలు
- బూరుగు చెక్క 25 గ్రాములు, నూరి పావు లీటరు నీళ్ళలో కలిపి రోజుకు రెండుసార్లు 3 రోజులు తాగించాలి.
- 50 గ్రాముల పూరెడు / పురుగుడు ఆకు దంచి 50 మి.లీ. మజ్జిగలో కలిపి రోజుకు రెండుసార్లు 3 రోజులు తాగించాలి.
- సోమింత చెక్క 20 గ్రాములు (ఎండినది 15 గ్రాములు) దంచి అరలీటరు నీళ్ళలో కలిపి రోజుకు రెండుసార్లు 3 రోజులు తాగించాలి.
- మారేడు ఆకులు, పువ్వులు, కాయలు, చెక్క, వేళ్ళు గుప్పెడు చొప్పున తీసుకొని దంచి 2 లీటర్ల నీటిలో అరగంట సేపు మరిగించాలి. చల్లారిన తర్వాత 100 మి.లీ. రోజుకు 2 సార్లు 3 రోజులు తాగించాలి.
- గుప్పెడు వేపాకు దంచి రసం తీసి పావు లీటరు మజ్జిగలో కలిపి రోజుకు ఒకసారి 3 రోజులు తాగించాలి.
- రక్తం, జిగురుతో కూడిన పారుడు
- పాలచెక్క 25 గ్రాములు దంచి ముద్ద చేసి రోజుకు 2 సార్లు 3 రోజులు తినిపించాలి.
- ఇప్పచెట్టు చెక్క 15 గ్రాములు, పసుపు 10 గ్రాములు కలిపి నూరి ముద్ద చేసి రోజుకు రెండుసార్లు 3 రోజులు తినిపించాలి.
- జీడి మామిడి చెట్టు చెక్క 25 గ్రాములు నూరి అరలీటరు నీళ్ళలో కలిపి రోజుకు రెండు సార్లు 3 రోజులు తాగించాలి.
- బలుసు, నేరేడు, పూరెడు, తంగేడు ఆకులు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని దంచి ముద్ద చేసి రోజుకు 2 సార్లు 3 రోజులు తినిపించాలి.
- విష మెక్కటం వల్ల వచ్చే పారడు
- కొబ్బరి చిప్పను కాల్చి పొడి చేసి ఒక కప్పు పొడిని అరలీటరు నీటిలో కలిపి రోజుకు 3 సార్లు తాగించాలి.
- ఏదైనా నూనె (వేరు సెనగ, గానుగ, కొబ్బరి) పావు లీటరు నూనెను తాగించాలి.
- ఆయుర్వేద మందులు:
- 20 గ్రాముల నెబ్లాన్ను 20 గ్రాముల బెల్లంతో కలపండి. ముద్దగా చేసి రోజుకు రెండుసార్లు తినిపించండి. లేదా బెల్లం బదులు మజ్జిగతో కలిపి తాగించండి. రోజుకు రెండుసార్లు 3 రోజులు ఇవ్వాలి.
- ¬మియో మందులు
- సాధారణ పారుడుకు పల్సటిల్లా 200, ఒక గ్లాసు నీళ్ళలో 10 చుక్కలు కలిపి పావు గ్లాసు చొప్పున రెండు పూటలు తాగించాలి. రెండు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే ఆర్సనిక్ ఆల్బం 200 ఇవ్వండి.
- సూక్ష్మ జీవుల వల్ల వచ్చే పారుడుకు ప్రొద్దున మెర్క్‌సాల్ 200, మధ్యాహ్నం, పోడో పైలం 200 సాయంత్రం ఆర్సనిక్ ఆల్బం 200 (2,3 రోజులు) ఇవ్వాలి.
(‘సన్న జీవాలను సక్కంగ సాకుదాం’
ఆంత్ర ప్రచురణ నుండి)