సాధారణంగా రైతులు కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి ఉంచుతారు. కాలువల ప్రాంతాల లోనే కాకుండా చెరువులు, బోర్లకింద కూడా పంటకు అవసరం కన్నా నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీళ్ళు నిలబడి ఉన్న నేలల్లో గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు. అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా కాకుండా కేవలం …
పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది. ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది. పొలం గట్లపై ఇంగ్లీషు …
గొర్రెల పెంట ఎరువు: రైతులు వేసవి సమయంలో పొలాలలో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలాలలో కట్టి వేయడం అనాదిగా వస్తున్న పద్ధతి. ఇది భూసారాన్ని పెంచడానికి ఒక సులువైన పద్ధతి. గొర్రెలు విసర్జించిన పెంట, మూత్రాలలో మొక్కలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కొద్ది శాతంలో లభిస్తాయి. అంతేకాకుండా గొర్రెలు అనేక రకాల ఆకులను …
మానవుడు వ్యవసాయం మొదలుపెట్టక ముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది…వానపాములతోనే నేలలో సొరంగాలు చేస్తూ నేలపైని ఆకులు, అలములను నేలలో కలుపుతూ వానపాములు నేలలను గుల్లగా చేస్తాయి. అందువల్ల వర్షం నీరు బాగా ఇంకుతుంది. వేర్లు మరింత లోతుకు చొరబడతాయి. వానపాములు నేలలోని సేంద్రియ పదార్ధాలను తింటూ విసర్జించటం వల్ల వాటి శరీరంలో అనేక …
1. వర్మీకంపోస్టులో అధిక మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాల్షియం, మ్యాంగనీసు, కాపర్ మొదలైన పదార్థాలు వుంటాయి. 2. వర్మి కంపోస్టులో హార్మోన్లు, యాంటీ బయోటిక్స్ ఉండటం వల్ల మొక్కలలో వ్యాధి నిరోధకశక్తి అధికమవుతుంది. 3. కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది. 4. రైతుకు పెట్టుబడుల భారం …
సేంద్రియ పద్ధతిలో… పురుగుల నియంత్రణ వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. రైతులు ప్రతి పంటకాలంలో పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. పురుగుల గురించి, వాటి జీవిత …
పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస్’ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు తక్షణం చనిపోతుంది. లేదా మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది. క్రింద పడిన పురుగులను చీమలు తినేసే అవకాశం వుంది. శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, …
రైతుల ఆత్మహత్యలు సంచలన వార్తలు కావడం మానేసి చాలా కాలమే అయింది. గత పదిహేడేళ్లలో దేశవ్యాప్తంగా 2,70,946 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. అందులో 33,326 మంది మన రాష్రానికి చెందిన వారే. రైతుకు వచ్చే ఆదాయం, పంట ఉత్పత్తి ఖర్చులకు సైతం సరిపోకపోవడమే ఈ …
పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు / పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులున్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, …
సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత క్ర.సం వృక్షం పేరు వృక్షం భాగం మూల పదార్థం చర్య / లక్షణం 1. దిరిసిన విత్తనం, ఆకు, వేరు కేఫిక్ ఆసిడ్, ఆల్కలాయిడ్స్ కీటక నాశిని 2. జీడి మామిడి జీడిపిక్క నూనె ఫినాలిక్ పదార్థాలు కీటక నాశిని 3. సీతాఫలం ఆకు, విత్తనం ఆల్కలాయిడ్స్ కీటక …