గ్రామీణ శ్రామికులకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని కేంద్ర మంత్రులు పొగుడుతుండటం మనం చూస్తూవుంటాం. ఇది కొంతవరకు నిజం కూడా. పథకం అమలులో గ్రామీణా భివృద్ధిశాఖ ఏర్పాటు చేసిన విధి విధానాలు, పద్ధతులు, సమాచారం అందుబాటు, పారదర్శకత …