వామింట వామింటను కొన్ని ప్రాంతాలలో కుక్కవామింట అని కూడా పిలుస్తారు. ఇది సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షికపు మొక్క. పత్రాలు సంయుక్తం. 3-7 వరకు పత్రాలు దాదాపు అండాకృతిలో ఉంటాయి. మొక్క అంతటా సన్నని నూగు ఉంటుంది. మొక్క ఘాటైన వాసనతో వుంటుంది. పుష్పాలు తెలుపు రంగులో గానీ, లేత పసుపు …