ఇది సాధారణంగా బావులు, చెరువులు, కాలువలు, వరి పొలాల్లో నీటిపై తేలియాడుతూ కనిపించే పెర్నజాతి మొక్క. అది నత్రజనిని స్థిరీకరించే నీలి ఆకు పచ్చనాచు (అనాబినా)తో సహజీవనం సాగిస్తూ (అనాబినా, అజోల్లాగా), దాని నత్రజనిని ఉపయోగించుకుంటూ బాగా పెరిగి నేలలో కలసినప్పుడు 40-60 కిలోల నత్రజనిని వరి పైరుకు అందిస్తుంది. వరి నాటిన వారం రోజుల్లో …