భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. ఒకటి – 5 సంవత్సరాల కొకసారి జరిగే ఎన్నికలు. రెండు – ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్. భారత ఎన్నికల వ్యవస్థ ఎలా రూపొందిందో, ఎంతగా దిగజారిందో మనం చూస్తున్నాం. ఓటింగ్ సరళి, ఓట్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు, ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల నైతికత, స్థాయి, …