తుమ్మి మొక్క ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. పత్రాలు వ్యాక్స్ (నూనె వంటి పదార్థం)ను కలిగి ఉంటాయి. పత్రాలపై స్పష్టమైన …