తంగేడు ఈ మొక్కలో హెక్సైల్ థాలేట్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఏంటి ఆక్సిడెంట్స్, ఆంత్రాక్వినాన్స్ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి. తంగేడు ఆకులను/ కొమ్మలను పొలాలలో పచ్చి ఆకు ఎరువుగా ఆదివాసీ ప్రాంత రైతులు వినియోగిస్తున్న విషయం ప్రత్యక్షంగా ఈ రచయిత చూశారు. రైతులు పంట పొలాలలో పచ్చిరొట్ట పంటలైన అవిశ, పిల్లి పెసర, జనుము …