గలిజేరు గలిజేరు మొక్కను కొన్ని ప్రాంతాలలో అంబటిమాడు అని కూడా పిలుస్తారు. ఇది 50 సెంటీ మీటర్ల పొడవు పెరిగే, నేలబారున విస్తరించే ఏకవార్షిక మొక్క. ఈ మొక్కకు తెల్లని దుంపవంటి తల్లివేరు వుంటుంది. శాఖలు తెలుపురంగులో వుంటాయి. మొక్క దేహమంతటా నూగుతో కప్పబడి వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు అండాకారంలోగానీ, …