అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, …