నానబాలు దీనిని హిందీలో ‘ధూది’ అని కూడా అంటారు. ఇంచుమించు 60 సెంటీమీటర్ల వరకు నేలపై పాకుతూ పెరిగే మొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. మొక్క అంతటా నూగుతో కప్పబడి ఉంటుంది. పత్రాలు 2 సెంటీ మీటర్ల పొడవుండి దాదాపు దీర్ఘ అండాకారంలో ఉంటాయి. పుష్పాలు గుత్తులుగా ఏర్పడతాయి. …