నల్లేరు ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో కంచెల వెంబడి తాడి, మర్రి మొదలగు చెట్లపైన పెరిగే బహువార్షికపు పొద. సుమారు 10-12 మీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలగా ఉండి, రసంతో కూడి ఉంటుంది. కణుపుల వద్ద నొక్కులు కలిగి ఉంటుంది. చిన్న చిన్న పత్రాలు అండాకారంగా ఉంటాయి. పత్రానికి ఎదురుగా ఒక చిన్న …