ఉత్తరేణి ఉత్తరేణి సుమారు 1-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఈ మొక్క అంతా సన్నని నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. ఆకులు అండాకారంలోగానీ, కొంచెం దీర్ఘ వృత్తాకారంలో గానీ వుంటాయి. పత్ర వృతం చాల చిన్నదిగా ప్రధాన కాండానికి అంటుకొని ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా లేత ఆకు …