శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని …
నారుకుళ్ళు తెగులు: నారు మడిలో లేత మొక్కలు గుంపులుగుంపులుగా చనిపోతాయి. నారుకుళ్ళు నివారణ: విత్తనాలను విత్తన శుద్ధి చేసి ఎత్తైన నారుమడులలో నారును పెంచాలి. నారు మొలకెత్తిన తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పిచికారీ చేయాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు కోనఫోరా కొమ్మకుళ్ళు తెగులు : …
పంజాబ్, హర్యానా పంటపొలాల్లో మళ్ళీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ‘నాసా’ శాటిలైట్ చిత్రాలు వీటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. వరి కోతల తర్వాత, సెప్టెంబర్ చివరి వారం నుండీ అక్టోబర్ మధ్య వరకూ పొలాల్లో పంట మిగులు గడ్డిని తగలబెట్టి గోధుమ సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకునే ఈ ప్రక్రియ దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది. …
తొలకరిలో టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే …
వాతావరణం: టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు. నేలలు: టమాటను యిసుకతో కూడిన గరప నేలల …
సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై …
వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలో వున్నట్టే ఈ …
మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి. నాణ్యమైన విత్తనం పైరు …
వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు. మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్, …
పురుగులను తినే పక్షులు గోరింక, పోలీస్ పిట్ట, పాలపిట్ట పంట పొలాల్లో కొమ్మలపై వాలి లేదా పొలంలో ఎగురుతూ శత్రుపురుగులను ఏరి తింటాయి. పంటలలో పక్షులు వాలడానికి వీలుగా పంగలకర్రలు ఏర్పాటు చేసి ఇటువంటి పురుగులను తినే పక్షులను ఆకర్షించవచ్చు. కొంగలు పొలం దున్నేటప్పుడు నాగలి వెంట నడుస్తూ నిద్రావస్థలో వున్న పురుగులని ఏరి తింటాయి. …