వరిలో సుడి దోమ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో సుడి దోమ
పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.
- పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
- జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి.
- 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:
- టూటేరు ఆకు కషాయం సుడి దోమకు సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- దీపపు ఎరలను ఉపయోగించి సుడిదోమ పెద్ద పురుగులను ఆకర్షించి నాశనం చేయాలి.
- ఇసుక 15 కిలోలకి 1.5 లీ. వేపనూనె బాగా పట్టించి, రాత్రంతా వుంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉధృతి తగ్గుతుంది.
Tag:వరిలో సుడి దోమ