ముసురు ఈగ
ముసురు ఈగ
ఆహారపు అలవాట్లు : తల్లి ఈగలు పూలలోని తేనె, పుప్పొడి తిని జీవిస్తాయి. లార్వాల చీడపురుగులను తింటూ ఎదుగుతాయి.
పురుగుల అదుపు : పేనుబంక, తామరపురుగు, పొలుసు పురుగు, చిన్న లార్వాలు, పచ్చపురుగు.
జీవిత దశలు : తల్లి పురుగు రెండు రెక్కులు కలిగి నల్లని శరీరంపై పసుపు పట్టీ కలిగి, కందిరీగలను పోలి ఉంటుంది. ఇవి పూలపై ’హమ్మింగ్ బర్డ్’ లాగ గాలిలో స్థిరంగా ఆగుతాయి. ఇవి తెల్లని మెరిసే గుడ్లని, పేనుబంక లేక చీడపురుగుల దగ్గరలో పెడతాయి. వీటి లార్వాలు పచ్చగా లేదా చుక్కలు కలిగి వుండి, పాకుతూ శత్రుపురుగులలోంచి, రసం పీల్చి చంపుతాయి. వీటి రంగు పరిసరాల్లో కలిసి పోవడం వలన బాగా దగ్గరగా చూస్తేగాని పోల్చుకోవడం కష్టం. ఇవి మొక్కలపై లేక నేలలో నిద్రావస్థలో వెళతాయి.