ఇతర నల్లులు
ఇతర నల్లులు
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు ఇతర పురుగులలో నుండి రసం పీల్చి జీవిస్తాయి.
పురుగుల అదుపు : అన్ని రకాల పురుగులు, పేనుబంక, గొంగళి పురుగు, గుడ్లు, పచ్చదోమ
జీవిత దశలు : డామ్సెల్ నల్లి తల్లి పురుగు చిన్నగా 2-4 మి.మీ. సైజులో సన్నగా గోదుమ నుండి ఎరుపు రంగులో ఉండి గుడ్లు మొక్కలోనికి చొప్పించి పెడతాయి. డింబకాలు, తల్లిపురుగు, వేగంగా పరిగెత్తి శత్రుపురుగులను సమర్థవంతంగా వేటాడి బలమైన ముందు కాళ్ళతో పట్టి రసంపీల్చి చంపుతాయి. గుడ్లనుండి వెలువడిన కొద్దిసేపటి నుండే డింబకాలు గుడ్లు పెట్టడం మొదలెడతాయి. ఇవి పప్పుజాతి పంటలలో ఎక్కువగా జీవిస్తాయి.