అల్లిక రెక్కల పురుగులు
అల్లిక రెక్కల పురుగులు
ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు పూల పుప్పొడి, తేనె తింటాయి. వాటి డింబకాలు అన్ని రకాల పురుగులను రసంపీల్చి తింటాయి.
పురుగుల అదుపు : పేనుబంక, పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగులు, కాయతొలుచు పురుగులు, వాటి గుడ్లు, పొలుసు పురుగులు.
జీవిత దశలు : తల్లిపురుగు 4 పారదర్శక అల్లిక రెక్కలతో 18 మి.మీ. సైజులలో సున్నితంగా, మెరిసే కనుగుడ్లు కలిగి పచ్చని దేహంతో ఉంటుంది. గుడ్లు మొక్కలపై సన్నని తీగ చివర దీపపు స్థంబాల మాదిరిగా పెడతాయి. తల్లిపురుగులు 6 వారాల జీవితకాలంలో 100 గుడ్ల వరకు పెడుతుంది. పిల్ల పురుగులు 1 సెం. మీ. సైజులలో ముదురు గోదుమరంగులో సన్నగా పొడవుగా ముందు వెనుక కొనదేలి ఉంటాయి. ఇవి బలమైన దవడలు కలిగి చీడపురుగు శరీరంలోకి విషాన్ని ఎక్కించి, వాటి రసం పీల్చి చంపుతాయి. ఒక్క పురుగు వారం రోజుల్లో 200 మించి పురుగుల లేదా గుడ్లు తింటుంది. రోజుకి 30-50 పేనుబంకను తినగలదు. జీవితకాలంలో 400 పేనుబంకను తినగదు. ఇవి దారాలతో గూడు కట్టుకుని, 5 రోజులు నిద్రావస్థలోకి వెళతాయి.