అక్షింతల పురుగులు
అక్షింతల పురుగులు
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని రకాల పురుగులను కొరికి తింటాయి.
పురుగుల అదుపు : పేనుబంక, పొలుసు పురుగులు, తెల్లదోమ
జీవిత దశలు : తల్లి పురుగులు అర్థచంద్రాకారంలో పసుపు, ఎరుపు మరియు నలుపు రంగులో వుంటాయి. వీటిలో కొన్ని తాకితే తమని తాము రక్షించు కోవడానికి దుర్గంధాన్ని చిమ్ముతాయి. ఇవి అండాకారపు, 10-50 గుడ్లను పేనుబంక లేక చీడపురుగుల దగ్గరలో ఆకు అడుగుభాగంలో పెడతాయి. పిల్ల పురుగులు 4 మి.మీ. సైజులో పొడవైన నల్లని శరీరంపై పసుపు లేక ఎరుపు రంగు మచ్చలు కలిగి ఒంటిపై ముళ్ళతో మొసళ్ళమాదిరి ఉంటాయి. ఇవి బలమైన దవడలు కలిగి చీడపురుగుల శరీరంలోకి చొప్పించి, వాటి రసం పీల్చి చంపుతాయి. ఇవి మొక్కలపైననే నిద్రావస్థలోకి వెళతాయి. తల్లిపురుగులు, పిల్లపురుగులు రోజుకు 50-60 పేనుబంక తింటాయి. వాటి జీవితకాలంలో 5,000 వరకు తినగలవని అంచనా.