కరాబిడ్ పెంకు పురుగు
కరాబిడ్ పెంకు పురుగు
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని రకాల పురుగును కొరికి తింటాయి.
పురుగుల అదుపు : గొంగళిపురుగులు, ప్యూపాలు మరియు నత్తలు.
జీవిత దశలు : తల్ల్లిపురుగులు 2-6 మి.మీ. సైజులో లోహపు కాంతితో మెరిసే లోహపు రంగుతో (నీలం, ఆకుపచ్చ, ఎరుపు) పొడవైన మీసాలు కలిగి ఉంటాయి. ఇవి నేలలో గుడ్లు పెడతాయి. తల్లి, పిల్ల పురుగులు బలమైన పళ్ళుకలిగి, ముందుకాళ్ళు పొడవుగా ఉండి, పగలు రాళ్ళు, చెత్తకింద దాగి, రాత్రి పూట వేగంగా పరుగెత్తి శత్రుపురుగులను వేటాడి తింటాయి. ఇవి నేలలో నిద్రావస్థలోకి వెళతాయి. ఇవి తమని తాము రక్షించుకోవడానికి శత్రువులపై దుర్గంధపు ద్రవాన్ని చిమ్ముతాయి. తల్లి పురుగులు 2-3 సం॥ వరకు కూడా జీవిస్తాయి.