కందిరీగలు
కందిరీగలు
ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు తేనె నీరు తాగి జీవిస్తాయి. లార్వా దశ చీడపురుగులపై జీవిస్తాయి.
పురుగుల అదుపు : పచ్చపురుగు, ఇతర గొంగళి పురుగులు, సాలీళ్లు.
జీవిత దశలు : వివిథ జాతులకు చెందిన కందిరీగలు నల్లగా లేదా నలుపుపై పసుపు, ఎరుపు రంగులో ఉండి ఒక్కటిగా లేదా సామూహికంగా జీవిస్తాయి. మట్టితో గూడు కట్టి అందులో గుడ్లు పెడతాయి. శత్రుపురుగులను ముల్లుగుచ్చి, విషంతో అచేతనంగా చేసి, దాని మీద గుడ్డు పెట్టి, గూటిలో పెట్టి, గూటిని మూసివేస్తాయి. గుడ్డు పొదిగిన తర్వాత పిల్ల పురుగులు వాటిని తిని, ఎదిగి, నిద్రావస్థలోనికి వెళ్లి, రెక్కలతో కందిరీగలుగా ఎగురుతూ బయటకొస్తాయి.