ఎర్ర చీమలు
ఎర్ర చీమలు
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి.
పురుగుల అదుపు : ఆకుతినే గొంగళిపురుగులు, రసం పీల్చు నల్లులు, పచ్చదోమ, కాయతొలుచు పురుగులు సీతాకోక చిలుకలు.
జీవిత దశలు : ఇవి ఆకులును మడచి దారాలతో గూళ్లు కడతాయి. రాణి చీమ రెండు రకాల గుడ్లు పెడుతుంది. ఫలధీకరణం చెందిన గుడ్లు ఆడగా మారి, మిగతావి కార్మిక చీమలుగా మారి, గూడు రక్షణ, ఆహారంగా ఇతర పురుగులు సేకరణ చేస్తాయి. ఇవి స్రవించే ద్రవంతో చర్మంపై మంట పుడుతుంది. పిల్ల పురుగులు ఉత్పత్తి చేసే సిల్క్ దారాలతో గూడు కడతాయి. తల్లి పెట్టే గుడ్లు తిని, మొదటి తరం చీమలు బలహీనంగా ఉంటాయి. అవి పెద్దవి అయినాక ఆహారంగా ఇతర పురుగులను బయట నుండి తెచ్చి మిగతా పిల్లలను పెంచడంతో తర్వాతి తరాలు బలమైనవిగా ఉంటాయి.