సాలీళ్లు
సాలీళ్లు
ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు శత్రుపురుగులను గూటిలో పట్టి రసంపీల్చి తింటాయి.
పురుగుల అదుపు : పచ్చదోమ, కాయతొలుచు పురుగులు, సీతాకోక చిలుకలు, ఈగలు, తెల్లదోమ
జీవిత దశలు : ఇవి 4 జత కాళ్ళు కలిగి ఉంటాయి. రెక్కలు ఉండవు. గుంపులుగా గుడ్లు దారాలతో అల్లిన గూటిలో లేదా మడచిన ఆకులలో కొమ్మలపై పెడతాయి. 3 వారాల్లో పిల్ల సాలీళ్లు వెలువడతాయి. తల్లిపురుగు 200-400 గుడ్లు 2-3 నెలల జీవితకాలంలో పెడుతుంది. ఇవి పురుగులలో విషం ఎక్కించి, రసం పీలుస్తాయి.