జిల్లేడు
జిల్లేడు
జిల్లేడు మొక్కలు ఆంధ్రప్రదేశ్ అంతటా పొలాలలోనూ, బీడు భూములలోనూ, రోడ్ల వెంబడీ కలువు మొక్కగా పెరుగుతాయి. ఈ మొక్క పత్రాలు, పుష్పాలు, వేరు, పాలను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. గొంగళి పురుగులను నివారించుటకు పొలం చుట్టూ లోతైన మడక చాలును ఏర్పాటు చేసి, అందులో ”జిల్లేడు” ఆకులను పరచి, వాటికి ఆశించిన పురుగులను చంపివేయాలి. ఎర్రగొంగళి పురుగులకు ”ఎరపంటగా” జిల్లేడు పనికి వస్తుంది. వర్షాభావ పరిస్థితులలోనూ, ముఖ్యంగా ఎండాకాలంలో చెదలు బత్తాయి, నిమ్మ, జామ, ఉసిరి, మామిడి చెట్ల మొదళ్ళపై ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి చెట్ల బెరడును గోకి తింటాయి. వీటిని సకాలంలో నివారించకపోతే చెట్లు క్రమేణా ఎండిపోతాయి. చెట్లకు చెదలు పట్టినట్లుగా గమనించగానే, ఆ మట్టినంతా ఒక బ్రష్‌ను వుపయోగించి పూర్తిగా దులిపేయాలి. చెట్ల మొదలు చుట్టూ జిల్లేడు ఆకులు పరచి, మట్టిలో బాగా కలిసిపోయేటట్లుగా తిరగ త్రవ్వాలి. ఒక సంవత్సర కాలంలో కనీసం 3-4 సార్లు ఈ విధంగా చేయవలసి వుంటుంది. చెట్టు వయస్సును బట్టి చెట్టుకు 2-5 కిలోల జిల్లేడు ఆకు అవసరం.
చెదపురుగును నివారించడానికి ఎకరానికి 100 కిలోల జిల్లేడు ఆకులు, లేత కొమ్మలను నేలపై సమంగా వేసి బాగా కలియదున్నాలి. ఈ పచ్చి ఆకు ఎరువు నేలలో కలియదున్నిన తరువాత మురుగడానికి తగినంత నీటి వసతి వుండాలి. జిల్లేడు ఆకులు భూమిలో బాగా క్రుళ్ళి చెదల నివారణలో కొంత వరకు వుపయోగపడతాయి. చెఱకు పంటలో కలుపు తీసేసిన తర్వాత, పొలంలో జిల్లేడు ఆకులు వేసి, నీరు కట్టాలి. జిల్లేడు ఆకులు క్రమంగా క్రుళ్ళి చెదలను నివారిస్తాయి. చెదలు సమస్యగా వున్న ఏ పంటలో నైనా ఈ పద్దతిని వుపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు.
తయారీ విధానం:
ముందుగా 15 కిలోల ఆవుపేడను 45 లీటర్ల నీటితో కలిపి ఒక మట్టికుండలోగానీ, ప్లాస్టిక్ డ్రమ్ములోగానీ పోసి మూతపెట్టండి. ఈ మిశ్రమమును ప్రతిరోజూ కర్రతో కలుపుతూ 4 రోజులు మురగపెట్టండి. 5వ రోజున పైన పేర్కొన్న ఆకులు, కాయలు తెచ్చి ముందుగా కాయలు మెత్తగా కొట్టి ఆవుపేడ, నీరు మిశ్రమంలో పోయండి. ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి డ్రమ్ములో వేసి 15 లీటర్లు గోమూత్రం అందులో పోసి మొత్తం మిశ్రమంను బాగా కలియబెట్టండి. ఆపైన కుండ/డ్రమ్ముపై మూతబెట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాగా కలియబెట్టండి. మొదటి 4 రోజులు ఆకులు పైకి తేలుతాయి. ఒక మోస్తరుగా ఆకులన్నీ మాగిన తర్వాత అయిదోరోజు నుండి ఆకులన్నీ ద్రావణం క్రిందకు జారుతాయి. ఈ విధంగా 10 నుండి 15 రోజులు ఉంచిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోసి వుంచుకోవాలి. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ వాడవచ్చు.
Tag:జిల్లేడు