బోడసరం
బోడసరం
ఇది ఇంచుమించు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. నీరు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నేలబారున పెరిగే ఒక చిన్న మొక్క. మొక్క అంతటా నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు కుంభకటకారంలో ఉంటాయి. అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఈ మొక్క అన్ని భాగాలలకు ఘాటైన వాసన ఉంటుంది. పుష్పాలు గుండ్రని గ్లోబు ఆకారంలో చిన్నవిగా, గులాబీ రంగులో ఉండి, పొడవైన కాడ చివర ఏర్పడతాయి. ఫలాలు నల్లంగా ఉంటాయి. పుష్పాలు, ఫలాలు అక్టోబరు – జనవరి మాసాల వరకు లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా వరి పొలాలలోను, కాలువల గట్ల వెంబడి కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్కను సమూలంగా వైద్య పరంగా వాడతారు. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యం కఫ, వాత రోగ నివారణలోను, జుట్టు ఒత్తుగా పెరుగుట కొరకు, దగ్గు నివారణ కొరకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
జోడసరం మొక్కలో వున్న రసాయనాలు, కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమి సంహారకంగా పనిచేస్తాయి. బోడసరం మొక్కను పంచపత్ర కషాయం తయారీలో వుపయోగించవచ్చు. పంచపత్ర కషాయం ఒక శక్తి వంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో వుంచుతుంది.
బోడసరం ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును (దీతీబషష్ట్రఱసర) నివారించే లక్షణం వున్నట్లు డా|| జె.కె. బేబి (1990 మధ్యప్రదేశ్) పరిశోధనలు తెలుపుతున్నాయి. బోడసరం ఆకుల ద్రావణానికి ధాన్యాన్ని ఆశించే కొక్కుపురుగు (ధాన్యం పురుగు)ను నియంత్రించే శక్తి వున్నట్లు డా|| బి.బి. మిశ్రా (2007) ఉత్తరప్రదేశ్) పరిశోధనలలో నిరూపితమైనది.
బోడసరం మొక్కను ”భూసార సూచిక మొక్కగా” (ూశీఱశ్రీ ఖీవత్ీఱశ్రీఱ్వ Iఅసఱషa్శీతీ) వ్యవసాయ పరిశోధనలో ఉపయోగిస్తారు. (డా|| పంకజ్, 2002)
వ్యవసాయంలో ఈ మొక్క వుపయోగాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగవలసిన అవసరం చాలా వుంది.
బహుళ ప్రయోజనాలు వున్న బోడసరం మొక్కను రైతులు కలుపు మొక్కగా చూడక, సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు తప్పనిసరిగా గ్రామాలలో రక్షించుకోవలసిన అవసరం చాల వుంది.
Tag:బోడసరం