పసుపు
పసుపు
పసుపు దుంపలో ‘కుర్కుమిన్’ అనే శక్తివంతమైన మూలపదార్థం వుంది. కుర్కుమినాయిడ్స్, జింజిబరిన్, టుమెరూన్, సుగంధ తైలాలు, అట్లాంటోన్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.
పసుపు పొడికి (పౌడర్) ధాన్యం నిలువలో ఆశించే పురుగులను నివారించే గుణం ఉందని, పసుపు పొడి + ఆవనూనె (20 గ్రాములు + 4 మి.లీ) మిశ్రమం మరింత శక్తివంతంగా పురుగులపై పని చేస్తుందని డా|| చందర్ (1991) పరిశోధనలు తెలుపుతున్నాయి.
ఆవు మూత్రం + పసుపు పొడి (500 మి.లీ + 50 గ్రా + 10 లీటర్ల నీరు) ద్రావణానికి కూరగాయ పంటల నాశించే ఆకులు తినే చిన్న చిన్న లార్వాలు, ఎర్రనల్లి, రసం పీల్చే పురుగులను సమర్ధవంతంగా అదుపు చేసే గుణం వుంది. ఈ ద్రావణాన్ని వుపయోగించి ఇండ్లలో పెంచే కూరగాయ పంటలను ఆశించే పురుగులను, సేంద్రియ పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. పసుపు మొక్క కషాయానికి వరి పంటను ఆశించే అగ్గి తెగులును నివారించే గుణం వుంది.
పంటల నాశించే తెగుళ్ళ నివారణ కొరకు, పసుపు దుంప కషాయం, పసుపు పొడి కషాయంలను రైతులు వుపయోగించుకోవచ్చు. (డా|| రఘునాథ్ 2012). పసుపు పంట కోతల తర్వాత, పొలంలో మిగిలిన వ్యర్థపదార్థాలను (పంట అవవేషాలు) మంచి సేంద్రియ ఎరువుగా (కంపోస్టు) వుపయోగించు కోవచ్చు.
పసుపు దుంపలో వున్న రసాయనాలు ”దోమలు”, ఈగలకు వికర్షితంగా (రిపల్లెంట్) పని చేస్తాయని డా|| దీక్షిత్ మరియు ఇతర శాస్త్రవేత్తలు, (1963, 1965) చేసిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. పసుపు ఆకులను ”పంచపత్ర కషాయం”లో రైతులు వినియోగించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.(డా|| రాత్ 1999)
Tag:పసుపు