ఆవాలు
ఆవాలు
ఈ మొక్కలో గ్లూకోసైనో లేట్, ఫ్లావనాయిడ్స్, సైనాపిక్ ఆమ్లం, స్టిరాల్స్, ప్రోటీన్స్, క్రొవ్వు పదార్థాలు వంటి అనేక రసాయనాలు వుంటాయి.
ఆవాలును ఆవనూనెను వంటకాలలో సువాసన కొరకు, పచ్చళ్ళ తయారీలో ఎక్కువగా వుపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో ఆవ నూనె వాడకం చాలా ఎక్కువ. ఆవ ఆకులను ఆకుకూరలలో వుపయోగిస్తారు. ఆవ ఆకులతో చేసిన వంటకాలకు చాలా డిమాండ్ వుంటుంది. ఆవ నూనెను శరీరానికి రాసుకోవడం ద్వారా చర్మానికి మృదుత్వం చలి నుండి రక్షణ పొందవచ్చు. అంతేకాకుండా అనేక వ్యాధుల నిర్మూలనలో కూడా ఆవాల మొక్కను, ఆవాలును, నూనెను వైద్య పరంగా వుపయోగిస్తారు.
ఆవాలు మొక్కను ఒక ఎర పంటగా క్యాబేజి, క్యాలిఫ్లవర్ పంటలలో వుపయోగించడం వలన పురుగులు, తెగుళ్ళను కొంతవరకు నియంత్రించవచ్చు.
ఆవాలు నుండి నూనె తీయగా వచ్చిన పిండిని (చెక్కను) భూసార అభివృద్ధి కొరకు వినియోగించవచ్చు.
ఆవాలు మొక్కలో వున్న రసాయనాలు ముఖ్యంగా గ్లూకో సైనో లెట్ ఎంతో శక్తివంతమైనది. ఆవాల కషాయానికి శిలీంద్ర నాశిని (ఖీబఅస్త్రఱషఱసవ) లక్షణాలు వున్నాయని పంటలనాశించు తెగుళ్ళను నివారించవచ్చని డా|| చరణ్ (1999) మరియు డా|| హార్వే (2002) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ మొక్క శిలీంద్రనాశిని గుణాలపై శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఎంతో అవసరం.
ఆవాల చెక్కను పొలంలో వేయడం ద్వారా, భూమి ద్వారా పంటలనాశించు వేరు పురుగులు, చిత్తపురుగులను అదుపులో వుంచవచ్చని డా|| రేయాన్ (2002) పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆవాలు మొక్క పంట అవశేషాలను కంపోస్టు గుంతలలో వేసి బాగా కుళ్ళిన తరువాత మంచి సేంద్రియ ఎరువుగా వుపయోగించుకోవచ్చు.
Tag:ఆవాలు