తుత్తురు బెండ
తుత్తురు బెండ
ఈ మొక్కలో బీటా – సై టోస్టిరాల్, అబుటిలిన్, ఎడెనైన్, కేమారిక్ ఏసిడ్, స్టిగ్మాస్టిరాల్, మిథాక్సీ కార్బోనిల్ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి.
ఈ మొక్క వేరును, నూనెతో కలిపి పూస్తే, కీళ్ళ నొప్పులు, బొల్లి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకులను ‘మూల శంఖ’ వ్యాధి నివారణకు వుపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను కొన్ని ప్రాంతాలలో ఆకుకూరగా వుపయోగిస్తారు. మొక్క మూలాన్ని చర్మ వ్యాధుల నివారణలో వుపయోగిస్తారు. ఈ మొక్క బెరడును వైద్యపరంగా వుపయోగిస్తారు.
తుత్తురు బెండ మొక్క మరియు వేర్లలో వున్న రసాయనాలు ముఖ్యంగా బీటా – సైటోస్టిరాల్ చాలా శక్తివంతమైనది. ఈ రసాయనాలకు పురుగులను అదుపు చేసే గుణం వుందని డా|| కామరాజ్ (2008) మరియు ఇతర శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ మొక్క కషాయం పంటలకు నష్టం కలిగించే ‘పొగాకు లద్దెపురుగు’పై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చినట్లు ప్రచురించటం జరిగింది.
ఈ మొక్క కషాయానికి పురుగుల గుడ్లను (వోవీసైడల్) మరియు లార్వాలను నివారించే లక్షణం వుండని డా|| అరివోలి, డా|| టెన్నిసన్ (2011) పరిశోధనలలో తేలింది. ఈ శాస్త్రవేత్తలు దోమల నివారణపై ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ మొక్క కషాయానికి, శిలీంద్రనాశని లక్షణాలు వున్నాయని డా|| అతుల్ (2014) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
Tag:తుత్తురు బెండ