పచ్చ పురుగు
పచ్చ పురుగు
పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – మార్చి
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.
పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది.
తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారి చేయాలి.
ఎరపంటగా బంతి, బెండ గట్లపై నాటుకొని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి.
పొలం చుట్టూ రక్షణ పంటగా జొన్న లేదా మొక్కజొన్న నాటుకోవాలి.
నివారణ :
పొలంలో ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చు.
పంట 45 రోజుల వయసులో తలలను తుంచడం వల్ల గుడ్లను నాశనం చేయవచ్చు.
పురుగు మందుల పిచికారి ఆపేయడం వల్ల పొలంలో రైతుమిత్ర పురుగులు పెరుగుతాయి. వీటిని మరింత ఎక్కువ చేయడానికి ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 60,000 చొప్పున (3 కార్డులు) పొలంలో పురుగు ఉధృతిని బట్టి 3-4 సార్లు వదలాలి.
లార్వా చిన్నదశలో నివారించడానికి పచ్చిమిర్చి-వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేయాలి.
ఎన్పివి ద్రావణం ఎకరానికి 500 ఎల్.ఇ. చొప్పున పిచికారి చేసి పురుగులలో వైరస్ తెగులును వ్యాప్తి చేయాలి.
పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసి పురుగులను అదుపుచేసుకోవాలి.
Tag:పచ్చ పురుగు