వరిలో పచ్చదీపపు పురుగు
వరిలో పచ్చదీపపు పురుగు
పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నాటే ముందు నారు మొక్కలను 5 శాతం వేప గింజల కషాయంతో 24 గం||లు శుద్ధి చేయాలి.
పొలంలో ఎప్పుడూ నీరు నిలువ ఉంచకుండా అప్పుడప్పుడు నీటిని తీసేస్తూ ఉండాలి (‘శ్రీ వరిసాగులో ఈ పురుగు ఉధృతి అతి తక్కువగా ఉంటుంది). ఇలా చేయడం వల్ల మొక్క మొదళ్ళ దగ్గర గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల పురుగు వృద్ది చెందదు.
ప్రతి 2 మీటర్లకి కాలిబాట వదలటం వలన గాలి బాగా ప్రసరించి పురుగు ఉధృతి తగ్గుతుంది.
పురుగులు గుడ్లు పెట్టే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి, పొలం గట్ల నుండి పీకి నాశనం చేయాలి.
నివారణ:
వేప నూనె, కానుగ నూనె 1:4 నిష్పత్తి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇసుక15 కిలోలకి 1.5 లీ. వేపనూనె బాగా పట్టించి, రాత్రంతా ఉంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉధృతి తగ్గుతుంది.
పొలంలో దీపపు ఎరలను ఉంచి పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఎకరానికి ఒక 150-250 వాట్స్ బల్బు ఉంచి దానికింద తొట్టిలో నీరు పోసి కొంచెం కిరోసిన్ పోస్తే దీపపు పురుగులు కాంతికి ఆకర్శింపబడి తొట్టిలో పడి చనిపోతాయి.
Tag:పచ్చదీపపు పురుగు