ఎర్ర గొంగళి పురుగు
ఎర్ర గొంగళి పురుగు
పురుగు ఆశించు కాలం: జూన్ – ఆగస్టు
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసుకుని కలియ దున్నుకోవాలి. దీని వలన గొంగళి పురుగు పొలంలోకి ప్రవేశించదు.
ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేరు వేరు స్థలాలలో ఉంచుకోవాలి.
ఎకరానికి 10 కిలోల కొయ్య బూడిదను ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి.
నివారణ :
లోతుగా వేసవి దుక్కులు చేసుకొని నిద్రావస్థదశలను నిర్మూలించాలి.
తొలకరి జల్లులు పడగానే మొదలుపెట్టి 30-45 రోజులపాటు పొలంలో దీపపు ఎరలు (100-250 వాట్స్ బల్బు) లేదా మంటలు వేసి తల్లి పురుగులను ఆకర్షించి నాశనం చేయవచ్చు.
ఎరపంటలైన జిల్లేడు, అడవి ఆముదం కొమ్మలను చాళ్ల వెంట పరచి లార్వాలను వాటిపైకి ఆకర్షించి నాశనం చేయవచ్చు.
పొలంచుట్టూ గోతులు తవ్వి, బూడిద ఒక పొరగా వేస్తే వలసపోయే పురుగులను బందించి నాశనం చేయవచ్చు.
పచ్చిమిర్చి వేప వెల్లుల్లి పొగాకు ద్రావణాన్ని పిచికారీ చేసి నివారించవచ్చు.