తెల్లదోమ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
తెల్లదోమ
పురుగు ఆశించు కాలం: జులై – జనవరి
తెల్లదోమ వలన అపరాలు, టమాట వంటి పంటలలో వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. తెల్లదోమ తల్లి పురుగులు ఆకులపై వృద్ధి చెంది రసంను పీలుస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి.
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలను నాటుకోవడం.
- పొలంలో ఎకరానికి 5 చొప్పున పసుపురంగు జిగురు పళ్ళాలు ఉంచి పురుగును అదుపు చేయవచ్చు.
- పురుగు మందులు వాడకం ఆపేస్తే పొలాలలో రైతుమిత్ర పురుగులైన జియోకోరిడ్ నల్లులు, ఆక్షింతల పురుగులు, క్రైసోఫా, అఫిలినస్ పరాన్నజీవులు తెల్లదోమను సహజంగా అదుపు చేస్తాయి.
నివారణ :
- 5 శాతం వావిలాకు కషాయం పిచికారి చేయడం.
- 3 శాతం వేపనూనె పిచికారి చేయడం.
- ఒక లీటరు కానుగ నూనె 200 లీ. నీటిలో కలిపి దీనికి కుంకుడు కాయల రసం కలిపి పిచికారీ చేసుకోవాలి.
Tag:తెల్లదోమ