నాణ్యమైన బెండసాగుకు సూచనలు
నాణ్యమైన బెండసాగుకు సూచనలు
మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను వాడవచ్చు. అంతే కాకుండా బెండలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వల న ‘గాయిటర్’ అనే వ్యాధిని నివారిస్తుంది.
ప్రస్తుతం బెండసాగులో ఉన్న సమస్యలను పరిశీలించి నట్లైతే మొట్టమొదటి సమస్య మరియు అధిక నష్టం కలిగించే సమస్య పల్లాకు తెగులు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ తెగులును తట్టుకునే రకాలు లేదా హైబ్రీడ్ను మాత్రమే సాగు చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ తెగులు ఆశించితే దీని నివారణ చాలా కష్టం. తెగు ఆశించిన మొక్కలన్నీ పొలం నుండి పీకి కాల్చివేయాలి. కాబట్టి ముందు నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక రెండో సమస్య విత్తన లభ్యత. సాగుకు అనువైన విత్తనాలు సరైన సమయంలో లభించకపోవటం, ఒక వేళ విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ధర (ముఖ్యంగా హైబ్రీడ్ విత్తనాలు) అందుబాటులో ఉండదు. రైతు ఈ సమస్య నుండి బయట పడాలంటే రకాలు లేదా హైబ్రీడ్ విత్తనాలను మీ పొలంలో మీరే స్వయంగా ఉత్పత్తి చేసుకోవాలి. బెండ సాగు విషయానికొస్తే ఇది ఉష్ణ మండలపు పంట ఎత్తైన కొండ ప్రాంతాలల్లో, చల్లటి వాతావరణంలో సరిగా పెరగదు. చలిని, మంచును అస్సులు తట్టుకోలేదు. పగటి ఉష్ణోగ్రత్త 25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే మొక్క పెరుగుదల బాగా ఉండి అధిక దిగుబడినిస్తుంది. బెండ సాగుకు సారవంతమైన ఇసుక నేల, మురుగు నీరు పోయే సౌకర్యం కలిగిన నల్లరేగడి నేల అనుకూలంగా ఉంటాయి. గుల్లగా, సారవంతమైన ఒండ్రునేలల్లో అధిక దిగుబడి ఇస్తుంది. బెండ సాగుకు విత్తన రకాల ఎంపిక చాలా ముఖ్యం. మిగతా కూరగాయ పంటలతో పోల్చిచూస్తే బెండలో హైబ్రీడ్ రకాలకు ధీటుగా సాధారణ రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి. రైతు హైబ్రీడ్ విత్తనాలపై ఖర్చు ఎక్కువ పెట్టకుండా వాటికి ధీటుగా దిగుబడినిచ్చే సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే సూటి రకాలు అర్కా అనామిక, పర్భానిక్రాంతి, పంజాబ్ పద్మిని, అర్కా అభయ మొదలైన రకాున్నాయి. ఈ రకాలు అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటాయి. హైబ్రీడ్ రకాలల్లో వర్ష, విజయ్, విశాల్, ప్రియ, సుప్రియ మొదలగునవి పల్లాకు తెగులును తట్టుకుంటాయి.
వాతావరణంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు విత్తనం మొలకెత్తదు. అందుకే చలికాలం కొన్ని ప్రాంతాలల్లో సాగుకు పనికిరాదు. విత్తనం మొలకెత్తటానికి ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటీగ్రేడ్ పైనే ఉండాలి. కాబట్టి బెండను ముఖ్యంగా వర్షాకాంలోనూ, వేసవిలోను సాగు చేసుకోవచ్చు. వర్షాకాలపు పంటగా సాగు చేస్తే జూన్- జూలై నెలల్లో విత్తుకోవాలి. ఆలస్యం చేస్తే (ఆగస్టు 15 తరువాత విత్తుకుంటే) మొక్కలు సరిగా పెరగవు. అంతే కాకుండా బూడిద తెగు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవి పంటగా ఫిబ్రవరిలో విత్తుకోవాలి. ఫిబ్రవరి తర్వాత విత్తుకొన్నట్తైతే మొక్క పెరుగుద తగ్గి పల్లాకు తెగులు సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి వర్షాకాలంలో జూన్ రెండో వారంలో, వేసవి పంటకైతే ఫిబ్రవరి రెండో వారంలో విత్తుకోవటం మంచిది. అధిక ధరపెట్టి విత్తనాన్ని కొంటాం కాబట్టి వృధా చేయకుండా సరైన మోతాదులో విత్తుకోవాలి. వర్షాకాలపు పంటకు ఎకరానికి 4-6 కిలోలు, వేసవి పంటకు 7-8 కిలోలు సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. చాలా మంది రైతు వర్షంపడిన తర్వాత అప్పటికప్పుడు మార్కెట్లో కొనుక్కొచ్చి విత్తన శుద్ధి చేయకుండా నేరుగా పొలంలో విత్తుకుంటారు. ఎప్పుడైతే విత్తనశుద్ధి చేసుకోలేదో పంటకాలంలో ఆశించే పురుగు, తెగుళ్ళను ఆహ్వానించినట్లే. విత్తనశుద్ధి చేసుకొని విత్తుకున్నట్లైతే మొదట్లోనే మనం సగం సమస్యలను నివారించినవాళ్ళమవుతాం. విత్తనశుద్ధికి గాను బీజామృతం లేదా బీజరక్షతో మరియు ట్రైకోడెర్మా విరిడి (5 గ్రా॥ కిలో విత్తనానికి) పట్టించి విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
బెండను రసాయన ఎరువు వాడకుండా సేంద్రియ ఎరువుతో పండించుకోవాలి. సేంద్రియ ఎరువు వలన నేల సారం పెరగడమే కాకుండా పురుగు, తెగుళ్ళ సమస్య చాలా వరకు తగ్గుతుంది. బెండ కాయలు కోసిన తర్వాత ఎక్కువ రోజు నిలువ ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి మంచిది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్ను పశువు ఎరువు లేదా 4 టన్ను వర్మీ కంపోస్టును వేసుకోవాలి. దీనితో పాటు 100 కిలో వేపపిండి వేసుకుంటే నేలలో ఉండే పురుగులను నివారించడమే కాకుండా మొక్కకు కావసిన నత్రజనిని అందిస్తుంది. రైతు తమ పంట అవశేషాలతో వానపాము ఎరువు (వర్మీ కంపోస్టు)ను స్వంతగా తయారు చేసుకొని వాడుకోవాలి. దీని తయారీకి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. కాబట్టి రైతులందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకొని తమ పంటకు కావలసిన ఎరువులను తయారు చేసుకొన్నట్లైతే లాభదాయకంగా ఉంటుంది. వర్మీ కంపోస్టు వేసుకోవటం వల్ల మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి మూ పోషకాలే కాకుండా సూక్ష్మపోషకాలైన జింక్, మాంగనీసు, ఐరన్, బోరాన్లు కూడా అందుతాయి. కాబట్టి మొక్కలు బాగా ధృడంగా పెరిగి పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా తట్టుకోగలుగుతుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజిటోబాక్టర్ (2 కిలోలు) 50 కిలో పశువు ఎరువుతో కలిపి నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. దీనితో పాటు 2 కిలో ఫాస్పోబాక్టీరియాను కూడా పొలం అంతా సమంగా చల్లుకోవాలి. వీటి వాడకం వలన పంట పెట్టుబడిని తగ్గించడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.
నీటి యాజమాన్యం:
విత్తిన వెంటనే నీరు పెట్టాలి. ఆ తర్వాత 4-5 రోజుకు రెండవసారి నీరు పారించాలి. వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే నేలలో తేమనుబట్టి నీరు పెట్టాలి. వేసవిలో 4-5 రోజులకు ఒకసారి నీటి తడులివ్వాలి. బెండను తక్కువ నీటితో డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.
బెండలో విత్తనోత్పత్తి:
రైతు విత్తన సమస్యను అధిగమించాలంటే తమ విత్తనాన్ని తామే ఉత్పత్తి చేసుకోవాలి. విత్తన ఉత్పత్తికి మామూలు పంట యాజమాన్య పద్దతులతోపాటు నాణ్యతా ప్రమాణాలు కోసం కొన్ని మెలకుల పాటిస్తే సరిపోతుంది.
విత్తన ఎంపిక:
మనం ఉత్పత్తి చేసే విత్తనం స్వచ్చత దాని తయారీకి మనం ఎంపిక చేసిన విత్తనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా రకం విత్తనోత్పత్తికి అధికారులు ధృవీకరించిన బ్రీడర్ / ఫౌండేషన్ విత్తనాన్ని నమ్మకమైన సంస్థ నుండి తెచ్చుకోవాలి.
వేర్పాటు దూరం:
ఒక రకం విత్తనాన్ని ఉత్పత్తి చేసినపుడు దాని పరిసర ప్రాంతాలల్లో ఇంకో బెండరకం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ రెండు రకాల మధ్య పరపరాగ సంపర్కం జరిగి విత్తనం స్వచ్ఛత కోల్పోతుంది. కాబట్టి రకానికీ, రకానికీ మధ్య వేర్పాటు దూరం కనీసం 200 మీటర్లు ఉండాలి. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో అడవిబెండ మొక్కులు లేకుండా చూసుకోవాలి.
పంట పరీశీనలకు గాను ప్రతి 10 వరుసల తర్వాత ఒక మీటరు దూరం ఉంచాలి. దీని వన పంటను ఎప్పటికప్పుడు అన్ని దశలో పరిశీలించడానికి, కేళీను ఏరి వేయడానికి, సస్యరక్షణ చర్యలు చేయట్టడానికి వీలుగా ఉంటుంది.
కేళీను ఏరివేయటం:
బెండ విత్తనోత్పత్తిలో ఇది ముఖ్యమైన అంశం. విత్తన నాణ్యత కోసం కేళీలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. దీనిని పంటకాంలో 3 దశలో చేపట్టాలి. మొదటి సారి పూతకు ముందు మొక్క పెరుగుదలను బట్టి, ఆకు ఆకారాన్ని బట్టి, మొక్కలపై నూగును బట్టి, కాండంపై రంగును బట్టి విరుద్ధమైన మొక్కలను తీసివేయాలి. రెండవ సారి పూత సమయంలో ఆకర్షక పత్రాల రంగు, పుప్పొడి రంగులను బట్టి కేళీలను ఏరి వేయాలి. చివరిగా మూడవసారి కాయపెరుగుదల దశలో కాయ ఆకారం, కణుపు, రంగును బట్టి కేళీలను తీసివేయాలి. అలాగే పల్లాకు తెగులు, ఇతర తెగుళ్ళు ఆశించిన మొక్కలను, అడవి బెండ మొక్కలను ఏరివేయాలి.
విత్తన సేకరణ:
కాయలు బాగా పండి, ముదిరి ఎండిన తర్వాత కోసుకోవాలి. పూత దశ నుండి 35 రోజులల్లో కాయలు ముదిరిపోయి ఎండిపోతాయి. ఎండిన కాయలను ఎప్పటికప్పుడు కోసుకోవాలి. లేకపోతే కాయలు పగిలి విత్తనం రాలిపోతుంది. ఎండిన కాయలనుండి విత్తనాలను సేకరించి 10 శాతం తేమ ఉండేటట్లు ఆరబెట్టాలి. తర్వాత నాశిరకం విత్తనాలను వేరుచేసి నాణ్యమైన విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి.
సస్యరక్షణ:
- బెండ సాగు పద్దతుల్లో మెలకులు పాటించినప్పటికీ ఈ పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి.
- పంట మార్పిడి అవలంబించాలి. రసం పీల్చే పురుగు నుండి రక్షక పంటగా పంట చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న వేయాలి.
- పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
- పురుగు ఉనికిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున ఉంచాలి.
- రసం పీల్చే పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 10 చొప్పున గ్రీజు లేదా ఆముదం పూసిన పసుపు డబ్బాలను ఉంచాలి.
- కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
- రసం పీల్చే పురుగు నివారణకు 5 శాతం వేప గింజ కషాయం లేదా వావిలాకు కషాయం పిచికారీ చేయాలి.
- కాయతొలిచే పురుగును పచ్చిమిర్చి, వెల్లులి కషాయం పిచికారీ చేసి నివారించాలి.