2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్” – 200 కు పైగా రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు
మిత్రులారా..
దేశవ్యాపితంగా 2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్”కు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. ఆ రోజు గ్రామీణ ప్రాంత వాస్తవ సాగుదారులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, చేతి వృత్తుల వారు, ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ రైతులు సమ్మెలో పాల్గ్గొంటున్నారు.
ఆరోజు గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయ ూత్పత్తులు (పంటలు, పాలు, కూరగాయలు, పండ్లు), ఇతర ూత్పత్తులు బయట నగరాలకు వెళ్లకుండా ఆపడం, పట్టణ ప్రాంతాల నుండి వచ్చే ూత్పత్తులను, సేవలను గ్రామీణ ప్రాంతానికి రాకుండా అడ్డుకోవడం ఈ గ్రామీణ భారత్ బంద్ లక్ష్యం.
దేశ వ్యాప్తంగా గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు, చేతివృత్తుల వారు తీవ్ర సంక్షోభంలో ూన్నారు. గత 20 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 3,25,000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు వేల మంది వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ూన్నాయి. వ్యవసాయ కుటుంబాలకు ప్రభుత్వాల నుండి అందే సహాయం, బడ్జెట్ కేటాయింపులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. సబ్సిడీ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. బ్యాంకుల నుండి సంస్థాగత రుణాలు రైతులకు సకాలంలో అందడం లేదు. ఫలితంగా పంటల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలను నష్ట పోయినపుడు వారికి ఎటువంటి పరిహారం అందడం లేదు. చాలా సందర్భాలలో కల్తీ విత్తనాల వల్ల, కల్తీ ఎరువులు, పురుగు మందుల వల్ల రైతులు పంట దిగుబడులను నష్టపోతున్నారు. రైతులు పండించే పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నా వాటికి చట్టబద్దత లేకపోవడం వల్ల ప్రభుత్వ మార్కెట్ యార్డ్‌లలో కూడా అవి అమలు కావడం లేదు. ప్రైవేటు వ్యాపారులు దళారులు రైతుల నుండి అతి తక్కువ ధరలకే పంటలను కొంటున్నారు. ఫలితంగా పెడుతున్న ఖర్చులకు, వస్తున్న ఆదాయానికి పొంతన లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న పోడు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి భూములకు పట్టాలు దక్కడం లేదు. ఫలితంగా వారి వ్యవసాయానికి పంట రుణాలు, పంటల బీమా అందడంలేదు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులలో వారు వ్యవసాయం చేస్తున్నా వారి వ్యవసాయానికి ఎటువంటి ప్రత్యేక సహాయం లేదు. దేశవ్యాపితంగా, రెండు రాష్ట్రాలలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ూన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కానీ, వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు కానీ అమలు కావడం లేదు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఫలితంగా ఒంటరి మహిళా రైతులు, భూమిపై పట్టా హక్కులు లేని మహిళా రైతులు వ్యవసాయం చేస్తున్నా వారి వ్యవసాయానికి ఎటువంటి సహాయం దొరకడం లేదు.
ఈ స్థితిలోనే రైతులు 2020 జనవరి 8న భారత గ్రామీణ బందుకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో పనిచేస్తున్న 200 కు పైగా రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఇతర గ్రామీణ పేదల సంఘాలు ఈ సమ్మెకు ూమ్మడిగా పిలుపు ఇచ్చాయి. ఈ సమ్మెను బలపరచాలని సమాజంలోని మిగిలిన శ్రేణుల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ లేఖ రాస్తున్నాము. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ూపాధ్యాయ, ూద్యోగ సంఘాలు, సహకార సంఘాలు, రైతు ూత్పత్తిదారుల సంఘాలు జనవరి 8న జరగనున్న గ్రామీణ బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆరోజు మీ గ్రామంలో / మండలంలో / జిల్లాలో గ్రామీణ రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, ఆదివాసీలు, చేతివృత్తుల వారు నిర్వహించే బంద్‌కు పూర్తి స్థాయిలో సహకరించాలని, సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ రైతుల ప్రజల సమస్యలపై దృష్టి సారించేలా ఒత్తిడి తెచ్చేందుకు గ్రామీణ ప్రజలు సాగిస్తున్న ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
Tag:ఆదివాసీ రైతులు