సి.ఎస్.ఎ. ఆధ్వర్యంలో నాబార్డ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు శిక్షణా తరగతులు
నాబార్డ్ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్.ఎ. ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు 25 ఎఫ్.పి.ఓ.ల నుండి సి.ఇ.ఓ.లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలు, ఎఫ్.పి.ఓ.ల నిర్మాణ లక్ష్యాలు, సి.ఇ.ఓ.ల బాధ్యతలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం గ్రామీణ ప్రజల లక్ష్యంగా తెచ్చిన వివిధ జీవోలు, చట్టాలు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలపై కూడా వివరించాం. రెండవ రోజు శిక్షణా తరగతులలో ఈ సంఘాలకు లక్ష్యాలను నిర్ణయించుకోవడం, సంఘాల నిర్వహణలో మెళకువలు, సంఘాల నిర్వహణకు నియమ నిబంధనలు, రైతులలో వ్యవసాయంతో పాటు, ఇతర ఉపాధి అవకాశాలను ముఖ్యంగా ఇళ్ళ దగ్గర కోళ్ల పెంపకం, గ్రామంలో గొర్రెల, మేకల పెంపకం, అర ఎకరంలో కూరగాయల సాగు, జీవన ఎరువుల తయారీ, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తిని, సేంద్రియ వ్యవసాయంను ప్రోత్సహించడం తదితర అంశాలపై ఎఫ్.పి.ఓ.లు దృష్టి సాదించాలని, తద్వారా బయట కంపెనీల మోసాల నుండి బయటపడాలని చర్చ జరిగింది. తెలంగాణలో సి.ఎస్.ఎ. ప్రోత్సహించిన 11 ఎఫ్.పి.ఓ.లలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయా ఎఫ్.పి.ఓ.ల సి.ఇ.ఓ.లు వివరించారు. అలాగే ఎఫ్.పి.ఓ.ల నిర్వహణకు మేంటైన్ చేయాల్సిన రికార్డుల పై వివరించారు. మధ్యాహ్నం సి.ఎస్.ఎ., సహజ ఆహారం కార్యాలయాన్ని, ఆర్గానిక్ స్టోర్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహజ ఆహారం టీం ఆర్గానిక్ లంచ్ ఏర్పాటు చేసింది.