వ్యవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం – డా॥ వి. వాసుదేవరావు
వ్యవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం
మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్గాయ్లు, అడవి పందలు మొదలగునవి వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. క్షీరదాలలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటకు చెప్పుకోదగ్గ నష్టం వాట్లిలుతున్నది. ఈ నష్టసరళిని పరిశీలించినట్లయితే, పంట విత్తనం నాటినప్పటి నుండి మొలకెత్తి పక్వానికి వచ్చే వరకు వివిధ దశలో వీటి వలన నష్టం వాట్లిలుతున్నది. అడవిపందుల సంతతి పెరగడమన్నది పంట నష్టపరిమాణం ఎక్కువ అవటానికి దోహదం చేస్తున్న అంశాలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అడవి పందల సంతతి పెరగడానికి కారణాలను గమనించిన్లయితే వాటి ఆవాస ప్రాంతాలైన అడవుల విస్తీర్ణం తగ్గడం, తద్వారా వాటికి కావలసిన ఆహారకొరత ఏర్పడడం, మరియు అడవి పందులను వేటాడే జంతువులు అంతరించిపోవడం వంటి కారణాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అడవిపందుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆహారం కొరకు సమీపంలోని పంట పొలాలపై ఆధారపడుతున్నాయి. ఆహారపంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, నూనె గింజల పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, మరియు పండ్ల జాతికి చెందిన జామ, దానిమ్మ, ద్రాక్ష మరియు కూరగాయ పంటలపై అడవి పందులు దాడిచేసి తినటం ద్వారా, పంటనష్టం సంభవిస్తుంది. అడవిపందులు తినడం ద్వారా చేసే పంట నష్టం కన్నా అవి విస్తృతంగా సంచరించటం ద్వారా పంట మొక్కులు ధ్వంసం చేయబడి నష్ట శాతం పెరుగుచున్నది.
అడవులకు సమీపంలో వున్న వ్యవసాయక సాగు ప్రాంతాలలో అడవి పందుల సంచారం అధికంగా వుండటం మూలాన నష్ట శాతం ఈ ప్రాంతాలలో ఎక్కువగా వుంటున్నది. అడవి పందులు ముఖ్యంగా ప్రాత:కాల సమయంలో, మరియు సాయంత్ర వేళల్లో గుంపులుగా సంచరించి పంట పొలాలపై దాడి చేస్తాయి. అడవి పందులకు వాసనను పసిగట్టే గుణం అధికంగా వుంటుంది. అందువలన అవి దూరం నుంచే పంట పొలాలను వాసన ద్వారా గుర్తించి దాడిచేయడానికి పూర్తి ఆస్కారం వుంటుంది.
సాంప్రదాయ పద్ధతులు – ఊరపందుల పెంట మిశ్రమం పిచికారీ విధానం
దీనికిగాను ఊరపందుల పెంటను సేకరించి తగినంత నీటితో ద్రావణంగా తయారు చేసి వడగట్టుకోవాలి. ముందే పంటపొలం చుట్టూ 1 అడుగు వెడెల్ప్ ప్రాంతాన్ని చదును చేసి, నీటితో తడపాలి. ఈ వడగట్టిన ద్రావణాన్ని తడి చేసిన ప్రాంతంలో పిచికారీ చేసినట్లైతే ఒక విధమైన వాసన వస్తుంది. ఈ వాసన గ్రహించిన అడవి పందుల ఆ ప్రాంతంలో వేరే పందులు సంచరిస్తున్నాయని భ్రమపడి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి వుండాలంటే 7 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తత్ఫలితంగా పందులు పంట పొలా సమీపంలోకి రాకుండా దూరంగా పారిపోయి పంటలు రక్షించబడుతాయి.
వెంట్రుకు వెదజల్లు పద్ధతి
క్షౌరశాలలో దొరికే వ్యర్థమైన వెంట్రుకలను సేకరించి పంటపొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడెల్ప్ ప్రాంతాన్ని చదును చేసి వెంట్రుకలను పల్చగా చల్లాలి. అడవిపందులు నేను త్రవ్వే అలవాటు, వాసన చూసే అలవాటు ప్రకారం అవి నేలమీద తమ ముట్టి భాగాన్ని వుంచి గాలి పీల్చడం వలన ఈ వెంట్రుకలు వాటి ముక్కులోనికి ప్రవేశించి శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనుకకు వెళ్ళిపోతాయి. తద్వారా పంటలు రక్షించబడుతాయి.
చీర పద్ధతి
పంట పొలాల చుట్టూ పాత చీరలను కర్రను పాతి గోడ వలె కట్టినట్లైతే, అడవి పందులు రాత్రి సమయాలలో దాడిచేసినపుడు ఆ చీర స్పర్శతో మనుషులు వున్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఈ శబ్దాలను విన్న మిగతా పందులు భయపడి దూరం నుండే వెనుదిరుగుతాయి. మరియు తద్వారా పంటలు రక్షించ బడతాయి.
పొగపెట్టు పద్ధతి:
ఈ పద్ధతిలో ఊరపందుల పేడ పిడకను సేకరించి మట్టి కుండలో వుంచి కాల్చడం ద్వారా పొగ వచ్చేటట్టు చేయాలి. ఈ కుండలను రాత్రి సమయాలో పొలం చుట్టూ అక్కడక్కడ వుంచాలి. ఫలితంగా వెలువడు వాసన ద్వారా ముందే అక్కడ మరొక పందుల గుంపు సంచరిస్తుందని భ్రమించి దూరం నుండే వెనుదిరుగుతాయి. ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 2 రోజులకు ఒక మారు పందుల పిడకను కాల్చి పొగ వచ్చునట్లు చేయాలి. తత్ఫలితంగా పందలు పంటపొలాల సమీపం నుండి దూరంగా పారిపోయి పంటలు రక్షించబడుతాయి.