వేసవిలో పశువుల సంరక్షణ
వేసవిలో పశువుల సంరక్షణ
వేసవి కాంలో పశువుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం. ముఖ్యంగా గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవుకు వేసవి తీవ్రత ప్రాంతాన్నిబట్టి మారుతుంది. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ ఎక్కువగా వుండటం వల న, ఈ వాతావరణం పశువులకు వడదెబ్బ తగలడానికి అనుకూలం. మన దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి. మాళీ గేదెలు ఎండకు తట్టుకోలేక, పాలు తగ్గడం, ఎదకు రాకపోవడం, ఒకవేళ ఎదకు వచ్చినా లక్షణాలు సరిగా కనిపించక పోవడంలాంటి సమస్యలను ఎదుర్కొంటాయి. సంకరజాతి ఆవులు మరియు ఇంగ్లీషు ఆవులు ఎండ తీవ్రతకు గురై, పాలు పూర్తిగా తగ్గిపోయి, రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగనిరోధక శక్తిని కోల్పోతాయి.
దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి కాబట్టి, మాళీ గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా వున్న ప్రాంతాలల్లో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
- పశువులను ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు వదలాలి. మిట్ట మధ్యాహ్నం పశువులు ఎండలో తిరిగినట్లయితే, పాదిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
- పశువులకు ఎల్లపుడు చాలినన్ని చల్లని నీటిని అందుబాటులో వుంచాలి. నీరు ఎక్కువగా తాగిన కొద్దీ, శరీరంలోని వేడి తగ్గిపోతుంది.
- గేదెలు మధ్యాహ్నం 2-3 గంటలసేపు చెరువులో పడుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రత పెరగకుండా వుంటుంది.
- పగులు గేదెలను చల్లటి చెట్ల క్రింద కట్టివేసి, 2-3 సార్లు నీటితో తడపాలి.
- గేదెలను పాలు తీసేముందు పొదుగును, శరీరమును చల్లటి నీటితో కడిగినట్లయితే, అవి సుమారు ఒక లీటరు పాలను ఎక్కువగా ఇస్తాయని పరిశోధనల ద్వారా వెల్లడయింది.
- పశువులు వేసవిలో క్రొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వీటిని తగ్గించి, శక్తినిచ్చే పిండిపదార్థాలను ఎక్కువగా తింటాయి. ఇది గేదెల విషయంలో మరీ ముఖ్యం. అధిక వేడి వల్ల పశువు పొట్టలో జీర్ణ రసాయనాలు తగు మోతాదులో ఉత్పత్తి కావు. అందుకే గేదెలను 2-3 సార్లు కడిగినట్లయితే, ఈ రసాయనాలు తిరిగి ఉత్పత్తి అవుతాయని పరిశోధనల ద్వారా తెలిసింది. కాబట్టి వేసవిలో మడ్డికూడు, జావ తగు మోతాదులో మిశ్రమ దాణాతో పాటుగా ఉప్పు కూడా కలిపి పశువులకు మేపాలి.
- పశువు రేకుల షెడ్డులో వుంటే, రేకుపైన తాటాకులుగానీ, వరిగడ్డిని గానీ కప్పి తడుపుతూ వుండాలి. చుట్టూ చాపు లేదా గోతాము పట్టాలు కప్పి మధ్యాహ్నం వేళల్లో 2`3 సార్లు ఆ పట్టాలను నీటితో తడపాలి. సాయంత్రం వేళల్లో రాత్రిపూట గేదెలను ఆరు బయట పడుకోనివ్వాలి.
- వేసవిలో పచ్చిమేత లేనిదే ఇంగ్లీషు ఆవులు వేడికి తట్టుకోలేవు. తప్పనిసరిగా పేరా గడ్డి, గిన్నీ గడ్డి, నేపియర్ గడ్డి మరి ఏ ఇతర పశుగ్రాసాన్నయినా వాటికి అందించాలి. ఈ గ్రాసాల్లో విటమిన్ ‘ఏ’ ఎక్కువగా వుండి రోగనిరోధక శక్తిని, జనన శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఈ పశుగ్రాసాల్లో నూటికి 85`90 శాతం నీరు వుండడం వలన, తేలికగా జీర్ణమయ్యి, పశువు పొట్టలో కావలసిన ‘బ్యాక్టీరియా’ మరియు ‘ప్రోటోజోవా’ను అభివృద్ధి చేసి పశువు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వేడిని కూడా తగ్గిస్తాయి.
- పశువుల పాకల్లో చల్లదనాన్ని ఇవ్వగలిగితే, అవి ఎదకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. పాకల చుట్టూ పట్టాలు కప్పి, వాటిని తడపడం ద్వారా గాని లేదా ప్రత్యేకమైన మందుల ద్వారా గానీ పశువులను ఎదకు తెప్పించవచ్చు.
ఇలా పైన చెప్పిన సూచను పాటించినట్లయితే, పశువులను వేసవిలో కూడా సంరక్షించుకొని, పాదిగుబడి తగ్గకుండా పొందడానికి అవకాశముంది.