వేరుశనగలో ఆకుముడత – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వేరుశనగలో ఆకుముడత
పురుగు ఆశించు కాలం: ఏ సమయాల్లోనైనా రావచ్చు
నివారణ :
- ఈ పురుగు ఒక్క వేరుశనగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది.
- పురుగు మందులు పిచికారి ఆపివేస్తే పరాన్న జీవుల వలన సహజ నియంత్రణ జరుగుతుంది.
- 5% వేప కషాయం పిచికారి చేయడం వల్ల తల్లి పురుగు గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు.
- పంట వరుసలపై ఒక ముళ్ళ కంపను లాగుతూ వెళ్ళడం వలన పురుగు కట్టిన గూళ్లను విడదీసి అదుపుచేయవచ్చు.
- పొలాల్లో దీపపు ఎరలను ఉంచి తల్లి పురుగులను ఆకర్షించి అదుపు చేయవచ్చు.