వామింట
వామింట
వామింటను కొన్ని ప్రాంతాలలో కుక్కవామింట అని కూడా పిలుస్తారు. ఇది సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షికపు మొక్క. పత్రాలు సంయుక్తం. 3-7 వరకు పత్రాలు దాదాపు అండాకృతిలో ఉంటాయి. మొక్క అంతటా సన్నని నూగు ఉంటుంది. మొక్క ఘాటైన వాసనతో వుంటుంది. పుష్పాలు తెలుపు రంగులో గానీ, లేత పసుపు రంగులో గానీ వుంటాయి. పుష్పాలు మొక్క చివర గుత్తులుగా ఏర్పడతాయి. ఫలాలు సన్నగా పొడవుగా ఉంటాయి. విత్తనాలు నల్లని రంగులో ఉంటాయి. ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూముల్లోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది.
ఈ మొక్కలో ఆల్కలాయిడ్లు, సాపోనిన్స్, టానిన్లు, ఫినాల్స్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.
వామింట మొక్కలో వున్న రసాయనాలు కీటకాలకు భక్షక నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పని చేస్తాయని, వామింట ఆకుల కషాయానికి క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ను ఆశించే డైమండ్ మచ్చల పురుగులను నివారించే గుణం వుందని డా|| అక్తర్ (1990) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
వంగ పంట నాశించే పొగాకు లద్దె పురుగు మరియు పేనుబంకను నివారించే గుణం వామింట కషాయానికి వుందని డా|| జైన్ మరియు గుప్తా (1985) పరిశోధనలు తెలుపుతున్నాయి.
వామింట ఆకులను ‘పంచపత్ర కషాయం’లో కూడా వినియోగించు కోవచ్చు. పంచపత్ర కషాయాన్ని ఇప్పటికే మన రాష్ట్రంలో రైతులు సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు, అనేక పంటలలో వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Tag:వామింట