“వరి చేనులో చేపల పెంపకం”
వరి చేనులో చేపల పెంపకం – ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి….
ఒక ఎకరం పొలంలో 60 సెంట్లు వరి, 20 సెంట్లు చేపల చెరువు, 20 సెంట్లు గట్టుగా తయారు చేసుకోవాలి. తేమను ఎక్కువ కాలామ్ నిలువ వుంచే నల్ల రేగడి భూములలో ఇలా చేయుటకు అనుకూలం ఉదజని సూచిక 6.8 నుండి 7.8 మధ్య ఉండాలి. ఒక ఎకరం పొలంలో ముందుగా 20 సెంట్ల చేప చెరువును 2 మీటర్ల వెడ్పు, 1 మీటరు లోతు వుండేలా నాలుగు వైపులా తవ్వాలి. చెరువును దీర్ఘ చతురస్రాకారంలోగానీ, కుదరకపోతే చతురస్రాకారంలోగానీ తవ్వాలి. కానీ అడ్డదిడ్డంగా ఏ ఆకారం లేకుండా చెరువును త్రవ్వరాదు. త్రవ్వగా వచ్చిన మట్టిని గట్టుగా వేసుకోవాలి. గట్లు కూడా నాలుగువైపులా 2 మీటర్లు వెడెల్ప్ ఉండేలా చేయాలి. ఎకరం పొలం లో మధ్యలో 60 సెంట్లలో దమ్ము చేయించి వరిని నాటుకోవాలి. వరిచేలో వివిధ రకాలైన వ్యవసాయ పనులు చేసుకొనుటకు వరి పొలంలోకి వెళ్ళుటకు వెనుక భాగంలో దారి వదలాలి. నాట్లు వేసిన 20 రోజుల తరువాత 50 నుండి 100 గ్రాముల బరువు గల చేప ప్లిల్లలను చెరువులో వేయాలి. దీనికి చేపలలో రకాలైన శీలావతి 200, బొచ్చి 200, మోసు 200 వేసుకోవాలి. చేపల చెరువులో చేప మేత నిమిత్తం తౌడు, పశువుల పేడ, అజొల్లా చేపల చెరువులో వేసుకోవాలి. దీనివనల మొక్కకు నత్రజని అందుతుంది. అజొల్లా వాతావరణంలో వున్న నత్రజనిని గ్రహించి వరి మొక్కలకు అందిస్తుంది. 5 కిలోల తౌడు రోజు విడిచి రోజు చేపల చెరువుకి మొత్తం 1000 కిలోలు వేయాలి. పశువుల ఎరువు 200 కిలోలు వేయాలి. అజొల్లా చేపలకు మేతగా కూడా ఉపయోగపడుతుంది.
వరిలో కోత కోయుటకు 7 నుండి 10 రోజుల ముందు నీటిని తీసివేసి వరిపంట కోయాలి. చేపులు చెరువుల్లోనూ, వరి చేల్లోనూ తిరుగుతుంటాయి. చేపలు వరిచేలో తిరుగుతూంటే వరిచేలో నష్టపరిచే పురుగులను తిని రైతుకు మేలు చేస్తాయి. వరి కోత సమయంలో నీటిని తీసివేసినప్పుడు చేపలు చెరువులోకి వెళ్లిపోతాయి. వరి పంటలో కంకి చిన్నగా ఉన్నా గింజ పూర్తిగా తోడుకొని నాణ్యమైన పంట వస్తుంది.
గట్లమీద వివిధ రకాల మిశ్రమ పంటల సాగు:
చెరువుల చుట్టూ 2 మీటర్ల వెడెల్ప్ గట్టు వుంటుంది. కాబట్టి ఈ గట్టమీద వివిధ రకాల మిశ్రమ పంటలు సాగుచేసి ఎక్కువ లాభం గడిరచవచ్చు. ఈ గట్లపై పలు రకాల కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు. గట్లపై కూర, అరటి, బొప్పాయి, మునగ తదితర మొక్కలు, ఆకుకూరలు, బీర, అనప, వంగ, బెండ, ఆకుకూరలు వేసుకోవచ్చు. తీగజాతి కూరగాయాలలో పందిరి వేసుకుంటే మంచిది. గట్లమీద వున్న కొబ్బరిచెట్ల ద్వారా కూడా రైతులకు ఆదాయం వస్తుంది. గట్లమీద ఎరపంటలైన బంతి, ఇతర పూల మొక్కలు పెంచుకోవచ్చు. గట్లమీద వానపాముల వర్మిబెడ్నుగానీ, లేదా నాడెప్ కంపోస్ట్‌ను గానీ పెట్టుకుంటే రైతు సొంతంగా ఎరువు తయారు చేసుకోవచ్చు. వరిచేలో, చేపల చెరువులో గట్లమీదున్న వివిధ రకాల మొక్కలకు వర్మి కంపోస్ట్‌ను, నాడెప్ కంపోస్ట్‌ను వేసుకోవచ్చు. ఈ నాడెప్ కంపోస్ట్‌ను, వర్మి కంపోస్ట్‌ను కిలో 3 నుంచి 5 రూపాయ వరకు ఇతర రైతులకు విక్రయించుకొని లాభం పొందవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. గట్లమీద వేసిన అరటి గెల ఒక్కింటికి రూ. 200 చొప్పున రూ. 30 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. గట్లమీద వేసి కూరగాయల, ఆకుకూరలు, పూల మొక్కల ద్వారా వేసిన 30 రోజుల నుండి ఆదాయం వస్తుంది. కరివేపాకు కూడా వేస్తే మంచి లాభమ్ వస్తాయి. గట్లమీద రోజూ ఉపయోగించే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర, కొత్తిమీర, మిరప పంటు సాగు చేయవచ్చు.
గట్లపై కోళ్ళు, పశువులు :
గట్లమీద వివిధ రకాల పంటలతో పాటు కోళ్ళు, మేకలు, గొర్రొలు, బాతులు, పశువులను కూడా పెంచి ఆదాయం పొందవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పురుగు మందులు వాడకం ఇతర కారణావల్ల తేనెటీగల సంతతి తగ్గిపోయింది. కావున గట్లమీద తేనెటీగల పెంపకం లాభదాయకం, గట్లపై కలపనిచ్చే మొక్కులు టేకు, యూకలిప్టస్ కూడా పెంచవచ్చు. నీడ వున్నచోట పసుపు, అల్లం , అనాస పంటలను సాగు చేయవచ్చు. గట్టుమీద నుండి చేపల చెరువు మీదుగా కోళ్ళు, బాతులు నివాసముండేలాగ షెడ్యును కట్టి వాటి పెంట చెరువులో పడేలా చేయాలి. తద్వారా చేపలకు మంచి ఆహారం దొరికి బరువు పెరుగుతుంది. ఈ ప్రదర్శనలో 20 బాతులు, 20 కోళ్ళు పెంచి ఆదాయం పొందవచ్చు. గట్టుపై ఒక గేదెనుగానీ, ఆవునుగానీ పెంచుకోవచ్చు. వచ్చే పేడ వర్మి కంపోస్ట్ తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే జీవామృతం ఘన జీవామృతరు కూడా చేసుకోవచ్చు.
చెరువులో వరిసాగు, ఖరీఫ్‌లో జులై నెలో, రబీలో డిసెంబర్ నెలో నాట్లు అయిపోవాలి. ఆస్యంగా నాట్లు వేస్తే కాండం తొుచు పురుగు (మొవ్వు పురుగు) ఎక్కువగా ఆశించే అవకాశముంది.
చెరువులో వరి సాగు చేయునపుడు వెడజ్లుట, లేదా డ్రమ్ సీడర్‌తో నాటు వేస్తే 60 సెంట్లకు గాను రూ. 2400 ఆదా చేయవచ్చు. నారుమడి, నాట్లు ఖర్చు ఆదా అవుతుంది.
చేప చెరువులో ఎక్కువ డిమాండ్ వున్న కొర్రమీను కూడా వేయవచ్చు. ఈ వరిలో చేప పెంపకం కాువ ద్వారా నీటి పారుద సౌకర్యం వున్న రైతుకు అనుకూం. మెట్లప్రాంత రైతుకు, బోర్ల కింద సాగు చేసేవారికి అనుకూం కాదు.
2వ సంవత్సరం నుండి ఆదాయం పెరుగుతూ వస్తుంది. కావున రైతు మూడు సంవత్సరాు వరుసగా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రైతు చేతికి నిరంతరం ఏదో ఒక ఆదాయం వస్తుంది. కొత్తగా చేసే రైతుకు ఎకరం నుండి రెండున్నర ఎకరాకు అనుకూం. ఒక చిన్న కుటుంబం ఈ వరిలో చేప పెంపకం అము చేసి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు.
నత్రజని ఎరువుకు ప్రత్యామ్నాయంగా అజొల్లా వాడకం వన తెగుళ్ళు, పురగు ూధృతి తగ్గుతుంది.
ఖరీఫ్‌లో వరి రకాు: ముంపును తట్టుకొని దిగుబడినిచ్చే పి.ఎల్.ఎ.1100 (బాడ్వా మసూరి), స్వర్ణ సబ్
1 రకాు మంచి ఫలితానిస్తాయి.
సస్యరక్షణ:
15 రోజుకొకసారి 3 సార్లు రబీలో 60 సెంట్లకు 600 మీ.లీటర్ల వేపనూనె పిచికారీ చేయాలి.
సూడోమోనస్ ఫ్లోరొసెన్స్ బాక్టీరియా 60 సెంట్లకు 300 గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయడం వలన పాముపొడ తెగులు, ఇతర తెగుళ్ళు అదుపులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి….