వరిలో గొట్టాల పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో గొట్టాల పురుగు
పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
- పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
- 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:
- పొలంలో వున్న లార్వాలను పంటపై త్రాడులాగి నివారించవచ్చు.
- చామ, నిమ్మ ఆకులను ముక్కలుగా కత్తిరించి పొలంలో వెదజల్లితే అవి పురుగు వికర్షిణిగా పని చేస్తాయి.
- 3-4 రోజులు పొలంలో నిలిచి ఉన్న నీటిని బయటకి పంపించాలి. లేదా నిలిచివున్న నీటిలో తాజా ఆవుపేడ వేయాలి.